TDP Mahanaadu: మహానాడు నిర్వహణపై పార్టీ నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం..

TDP Mahanaadu:మహానాడు నిర్వహణపై టీడీపీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కడజ జిల్లా పులివెందుల టీడీపీ నేతలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత ఆధ్వర్యంలో నేతల కుమ్ములాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 12, 2025, 08:12 PM IST
TDP Mahanaadu: మహానాడు నిర్వహణపై పార్టీ నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం..

TDP Mahanaadu: తెలుగు దేశం పార్టీ యేడాది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మూడు రోజుల పాటు మహానాడు నిర్వహిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే కదా. కోవిడ్ సమయంతో పాటు కొన్ని సందర్బాల్లో ఈ  కార్యక్రమం జరగలేదు. ఇక ఏపీలో ప్రతిపక్షం తర్వాత మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత వస్తోన్న తొలి మహానాడు కావడంతో దీన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించేందుకు తెలుగు దేశం పార్టీ సమాయాత్తం అవుతోంది. ఈ యేడాది వైయస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోట కడపలో ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కడప జిల్లాలో నేతలను అప్రమత్తం చేశారు చంద్రబాబు నాయుడు.

Add Zee News as a Preferred Source

అంతేకాదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లదే పూర్తి బాధ్యత అని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒక వర్గమే ఉండాలి.. రెండవ వర్గానికి తావులేదన్నారు. అందరు కలిసి మెలిసి పనిచేయాలని పిలుపు నిచ్చారు.  

పులివెందుల వ్యవహారంపై ఎమ్మెల్సీకి చంద్రబాబు చురకలంటించినట్లు తెలుస్తోంది. కడపలో మహానాడు నిర్వహణకు అందరూ సమన్వయంతో పనిచేయాలని బాబు స్పష్టం చేశారు.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News