)
Kadapa ZP Chairman: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర దెబ్బతిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాకిచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలో చెక్ పెట్టేందుకు భారీ వ్యూహం రచించింది. కడప గడ్డపై పసుపు జెండా ఎగురవేసేందుకు సరికొత్త ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలను తన గుప్పిట్లోకి తీసుకుంటున్న అధికార పార్టీ.. 'వై నాట్ కడప' అనే వ్యూహం అమల్లో పెట్టింది. ఈ క్రమంలోనే కడప మేయర్ పీఠంపై కన్నేసింది. అందులో భాగంగా క్యాంపు రాజకీయాలకు తెర రేపింది. అదేంటి? టీడీపీ పాచిక పారనుందా? మాజీ సీఎం జగన్ కు సొంత జిల్లాలో భారీ షాక్ ఎదురుకానుందా తెలుసుకుందాం.
కడప జిల్లాలో మొదలైన క్యాంపు రాజకీయాలు.. ఛైర్మన్ పీఠం కాపాడుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్, బెంగళూరుకు జెడ్పీటీసీల తరలించింది. ఈ సందర్భంగా వైసీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ నెల 27న కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక ఉండడంతో పార్టీ వ్యూహం.. నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.
కడప జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లా పరిషత్ ఇంచార్జీ చైర్మన్ జేష్టాది శారద పదవిలో ఉన్నారు. వైసీపీ అధిష్టానం బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ రామగోవింద రెడ్డికి ఖరారు చేసింది. టీడీపీ పోటీ చేస్తుందా? తప్పుకుంటుందా? అనేది వేచి చూడాలి. మొత్తం 50 జెడ్పీటీసీలలో ఒకరు రాజీనామా చేయగా.. మరో రెండు స్థానాలు ఖాళీ ఉన్నాయి. మొత్తం 47 మంది జెడ్పీటీసీలు ఉన్నారు.
ఎంత ఖర్చయినా సరే!
టీడీపీకి ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు 9మంది జెడ్పీటీసీలు ఉన్నారు. వైసీపీకి 38 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. మెజారిటీ వైసీపీకి ఉన్నా తెలుగు దేశం గట్టిగా ప్రయత్నాలు మొదలు పెడితే బేరసారాలు నడవడం గ్యారెంటీ. 15మంది జెడ్పీటిసీలకు 7-8 కోట్ల ఖర్చుతో పాటు అదనంగా ఇతర ఖర్చులకు రూ.3 కోట్లు అవుతుందని టీడీపీ జిల్లా నాయకులు మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. అయితే ఎంత ఖర్చయినా సరే భరించి జెడ్పీ చైర్మన్ పదవి పొందాలని టీడీపీ భావిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి