Telugu Desam Party:  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చి సుమారు ఎనిమిది నెలలు కావొస్తుంది.ఎన్నికల ముందు  పార్టీ  అధికారంలోకి రావడానికి సీనియర్లు అందరూ బాబు డైరెక్షన్ లో పని చేశారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక మాత్రం సీనియర్లు ఎందుకో సైడ్ అయ్యారనే ప్రచారం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా కొందరు సీనియర్ నేతలు ఉన్నట్లుండి ఒక్క సారిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లారని పార్టీలో తెగ ప్రచారం జరగుతుంది. దశాబ్దాల కాలం నుంచి చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెదులుతున్న నేతలు సైతం గప్ చుప్ గా మారడం వెనుక కారణం ఏంటా అని పార్టీ శ్రేణులు తెగ చెవులు కొరుక్కుంటున్నాయి.ఇటీవల బాబు  అధికారంలోకి వచ్చాక కొందరు సీనియర్లను బాబు తన కేబినెట్ లోకి తీసుకున్నారు. కేబినెట్ మంత్రులుగా ఉన్న సీనియర్ నాయకులు సైతం గతంలో ఉన్నట్లు ఆక్టివ్ గా ఉండడం లేదనేది తెలుగుదేశంలో జరుగుతున్న చర్చ.  వ్యక్తిగత కారణాలతో ఆ నేతలు సైలెంట్ అయ్యారా లేక ఏదైనా వారిలో అసంతృప్తి దాగుందా అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐతే టీడీపీ సీనియర్లు ఎందుకు సైలెంట్ అయ్యారా అన్న విషయంలో ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాలు వాదనలు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తుంది ఒక అంశం ఏంటంటే తెలుగు దేశం పార్టీ కార్యకలాపాలతో పాటు ప్రభుత్వంలో కీలక నిర్ణయాలన్నీ ఇప్పుడు యువనాయకుడు లోకేశ్ పర్యవేక్షిస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో ఇక పార్టీనీ, అలాగే ప్రభుత్వాన్ని నడిపేది లోకేశ్ అని దానిలో భాగంగా ఇప్పటి నుంచే తన టీంను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుగుదేశంలో తెగ ప్రచారం జరుగుతంది.అందుకే బాబు కేబినెట్ లో కూడా ఒకరిద్దరి సీనియర్లకు తప్పా మిగితా ఎవ్వరికీ చోటు దక్కలేదని దానికి కారణం కూడా లోకేశ్ అనే చర్చ ఉంది. ఇప్పటి నుంచే పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టుకోసం లోకేశ్ ప్రయత్నిస్తున్నాడని అందుకు అనుగుణంగా కొత్త టీంను తయారు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు.సీఎంగా చంద్రబాబు ఉన్నా కీలక నిర్ణయాలన్నీ లోకేశ్ వే అని టీడీపీ క్యాడర్ చెప్పుకుంటుంది.దీంతో ఇప్పుడు టీడీపీలో లోకేశ్ పవర్ సెంటర్ గా మారారని వారు చెబుతున్నారు.


ఇప్పుడు ఇదే కొంత సీనియర్లకు, పార్టీకీ కొంత మేర గ్యాప్ రావడానికి కారణం అవుతుందని టాక్. ఇటీవల పార్టీ సీనియర్ నేత యనుమల రామకృష్ణుడు రాసిన ఒక లేఖ పార్టీలో తెగ సంచలనం సృష్టించింది. ఆ లేఖ కూడా ఈ అసంతృప్తిలో భాగంగానే అని తెలుస్తుంది.రాజ్యసభ ఉప ఎన్నికల్లో తమకు అవకాశం వస్తుందని యనుమలతో పాటు పలువురు సీనియర్లు ఆశలు పెట్టుకున్నారట. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం బీద మస్తాన్ రావు, సానా సతీష్ కు అవకాశం ఇచ్చింది. దీంతో సీనియర్లలలో మరింత ఆగ్రహాన్ని పెంచినట్లు అయ్యిందని సీనియర్ల అనచరులు చెప్పుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు ఒకప్పుడు చంద్రబాబు అపాయింట్ మెంట్ లేకున్నా నేరుగా కలిసే అవకాశం ఉన్న సీనియర్లు సైతం ఇప్పుడు చంద్రబాబును కలవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారట ఇది కూడా సీనియర్లలో మరింత అసంతృప్తిని రాజేస్తుందని చర్చించుకుంటున్నారు.వీటన్నింటి దృష్ట్యా సీనియర్లు తమకు పార్టీలో కొంత ప్రాధాన్యత తగ్గినట్లు ఫీలవుతున్నారని అందుకే కొందరు పార్టీ విషయంలో అంటీముట్టనట్లు ఉంటున్నట్లు టీడీపీ సర్కిల్ లో టాక్.


ఇది ఇలా ఉంటే  లోకేశ్ నిర్ణయాన్ని యువతరం నాయకులు మాత్రం సమర్థిస్తుండడం విశేషం. పార్టీ భవిష్యత్తు దృష్ట్యా యువరక్తాన్ని ఎక్కించాల్సి ఉందని టీడీపీ యువ నాయకులు చెబుతున్నారు.పార్టీ సీనియర్ల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఉండదని వాళ్ల సేవలను పార్టీ మరోలా వాడుకుంటుందని లోకేశ్ అనచరులు చెబుతున్నారు.సీనియర్లకు అవకాశం ఇవ్వని పక్షంలో వారి వారసులకు మంచి అవకాశాలు పార్టీ కల్పిస్తుందనే భరోసాను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే కొందరు సీనియర్ల వారసులకు మంత్రులుగా అవకాశం ఇచ్చారనే విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. పార్టీనీ మరింత పరుగులు పెట్టించాలి అంటే ఇలాంటి నిర్ణయాలు తప్పవని మరి కొందరు నేతలు చెబుతున్నారు.


దశాబ్దాలుగా టీడీపీలో చక్రం తిప్పిన సీనియర్లు ప్రస్తుత పరిణమాల నేపథ్యంలో కొంత డీలాపడ్డారని చర్చ జరుగుతుంది. చంద్రబాబుతో ఎలాగో తమ డిమాండ్లను పట్టుబట్టి నెరవేర్చుకునే వాళ్లమని కానీ ఇప్పుడు లోకేశ్ హవా నడుస్తుండడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని సీనియర్లు భావిస్తున్నారు. దీంతో ఇటు సైలెంట్ గా ఉండలేక తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కలేక తెగ బాధపడిపోతున్నారట.ఇదే అసంతృప్తి కంటిన్యూ అయితే సీనియర్లు ఏం చేస్తారనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది.


Read more: Mohan Babu Vs Manchu Manoj: మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా.. గన్ సీజ్ చేసిన పోలీసులు.. మంచు మనోజ్ పై దాడి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.