Liquor Scam: గత ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ కుంభకోణం జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పార్లమెంట్‌లో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అంటే 2019-24 మధ్యకాలంలో 18 వేల 860 కోట్ల నష్టం జరిగిందంటూ గణాంకాలు వివరించారు.
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో 18 వేల 860 కోట్ల మేర ప్రభుత్వానికి మద్యం కుంభకోణం ద్వారా నష్టం వాటిల్లిందని టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్‌లో వ్యాఖ్యలు చేశారు. పారదర్శకత లేకుండా వైసీపీ నేతలు 20వ వేల కోట్ల రూపాయలు ఆర్జించారని ఆరోపించారు. ఈ భారీ మద్యం కుంభకోణంపై ఈడీ, సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని కోరారు. పార్లమెంట్‌లో ఆరోపణలు చేశాక ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షానే టీడీపీ ఎంపీని తన కార్యాలయానికి రప్పించుకుని మాట్లాడినట్టు సమాచారం. ఎంపీ ఆరోపించిన కుంభకోణంపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. ఆ తరువాత ఇవాళ ఉదయం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఢిల్లీ పరిణామాల్ని వివరించారు. మద్యం కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం
మద్యం కుంభకోణం అనగానే రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆందోళన రేగుతోంది. గతంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవిత జైలుపాలయ్యారు. అటు ఛత్తీస్‌గఢ్‌లో కూడా మద్యం కుంభకోణం ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి బాఘెల్ ఇంట్లో సోదాలు జరిగాయి. తాజాగా తమిళనాడులో కూడా మద్యం కుంభకోణం జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి మద్యం కుంభకోణం ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ పరిపాటిగా మారింది. లావు కృష్ణదేవరాయలు ఆరోపించిన ఈ వ్యవహారంలో కూడా సీబీఐ లేదా ఈడీ జోక్యం చేసుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. వైసీపీలో ఈ వ్యవహారం ఇప్పుడు టెన్షన్ రేపుతోంది.
అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ ఆరోపణల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ షాపుల్ని గణనీయంగా సగానికి సగం తగ్గించినందుకు లంచాలు అందాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. బెల్ట్ షాపుల్ని పూర్తిగా తొలగించినందుకు లంచాలు ఇచ్చారా అని అడుగుతున్నారు. మద్యం షాపులన్నీ ప్రభుత్వమే నిర్వహించి ఆదాయం ప్రభుత్వానికి వచ్చినట్టు చేసినందుకు మద్యం కంపెనీలు లంచాలు ఇచ్చాయా అని నిలదీస్తున్నారు.
Also read: JEE Main 2025 Admit Card: జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









