Thalliki Vandanam Big Update: తల్లికి వందనం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద సంవత్సరానికి రూ. 15000 ఆర్థిక సాయం విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనుంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి విద్యార్థికి లబ్ధి పొందేలా ఈ చర్యలు చేపట్టారు. ఏడాదికి రూ. 15000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. అయితే తల్లుల ఖాతాలో రూ.13వేల నగదు జమ చేస్తామని మిగతా రూ.2000 మినహాయింపు స్కూలు, కాలేజీలు అభివృద్ధి పనుల కోసం అని చెబుతోంది. ఇక ఈ మినహాయించిన నిధులను కలెక్టర్ ఆధ్వర్యంలో జమ చేయనున్నట్లు తెలిపింది.
కుటుంబ ప్రభుత్వం 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి విద్యార్థుల ఖాతాలో 15000 జమ చేస్తామని చెప్పింది నేపథ్యంలో ఈరోజు ఆ తొలి విడత శ్రీకారం చుట్టింది ఇంక దీని అమలుకు ఇప్పటికే జీవ కూడా జారీ చేసింది అయితే 15000 కాకుండా 13000 మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించింది.ఇక సూపర్ సిక్స్ హామీల్లో ఇది ఒకటి పిల్లల చదువు కోసం తల్లులను ఆర్థికంగా ప్రోత్సహించడానికి పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నిధులు నేరుగా జమ అవుతాయి. ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థి అర్హులే..
పథకం ప్రధాన లక్ష్యం..
ఈ పథకం ప్రధాన లక్ష్యం తల్లులను గౌరవించి విద్యార్థులు చదువులు మధ్యలో ఆపకుండా ఆర్థిక సాయం అందించడానికి, డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. విద్యార్థి తల్లి లేదా తండ్రి ఖాతాల్లో ఆధార్ అనుసంధానం చేసి ఉండాలి. అంతేకాదు 75% కంటే ఎక్కువ హాజరు శాతం ఉన్నవాళ్లు అర్హులు. అయితే గత ప్రభుత్వం హయాంలో కూడా 'అమ్మ ఒడి' పథకం కింద నిధులు మంజూరు చేశారు. రూజ. 15వేలలో రూ.1000 మరుగుదొడ్ల నిర్వహణ, మరో వెయ్యి పాఠశాల నిర్వహణకు కేటాయించారు. ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ఫాలో అవుతుంది. రూ. ఒక్కొక్కరికి 13 వేలు చొప్పున ఇవ్వనుంది.
#సుపరిపాలనలోతొలిఅడుగు#FirstStepRebuildingAP
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుంది. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతి రోజూ పని చేస్తున్నాం. అనేక… pic.twitter.com/5CwGjK38hg— N Chandrababu Naidu (@ncbn) June 12, 2025
సుపరిపాలనలో తొలి అడుగు..
ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకున్నందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఎన్నో సవాళ్లను దాటుకొని ఏడాది కాలంలో పెన్షన్, అన్న క్యాంటీన్లు, దీపం పథకం, మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి తెచ్చామన్నారు. ఇది సుపరిపాలన తొలి అడుగు ప్రజల్లో నమ్మకం కలిగించామని మరింత సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నామని ట్వీట్ చేశారు.
Also Read: జియో సూపర్‌హిట్ ప్లాన్.. రూ.895 కే 11 నెలల వ్యాలిడిటీ పొందే ఛాన్స్..
Also Read: వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం.. స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook