Thalliki Vandanam Big Update: 'తల్లికి వందనం' ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా రూ.15000 ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ పాఠశాల విద్యాశాఖ నుంచి విద్యార్థుల డేటాను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఉన్న సమాచారంతో సరిపోలుస్తోంది. ఇదిలా ఉండగా ఇక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం..
గతంలో సచివాలయాల ద్వారా నిర్వహించిన డేటా ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేసేవారు. కానీ రెండు రోజులుగా దీనిపై అధికారులు సమీక్ష నిర్వహించలేదు. ఇవ్వాలో రేపో మార్గదర్శకాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు పథకాలు భాగంగా తల్లికి వందనం పథకం 2025 నుంచి అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.15000 జమ చేస్తుంది.
ఈ పథకానికి అర్హత సాధించాలంటే ఏపీ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. విద్యార్థి ప్రైవేటు లేదా ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉండాలి. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు అయితే విద్యార్థి కనీసం 75% హాజరు శాతం కూడా కలిగి ఉండాలి. తల్లి పేరు నా బ్యాంకు ఖాతా ఓపెన్ చేసి ఉండాలి. ఇక కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి కూడా లోబడి ఉండాలి వాళ్లు మాత్రం ఈ తల్లికి వందనం పథకానికి అర్హులవుతారు.
అయితే తల్లి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, హాజరు సర్టిఫికెట్ రేషన్ కార్డు కుల ధ్రువీకరణ పత్రం వంటివి తప్పనిసరిగా కలిగి ఉండాలి. సమాచారం మేరకు జూన్ 12న పథకం ప్రారంభిస్తారు అన్నారు. అయితే మార్గదర్శకాలు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.ప్రధానంగా ఈ పథకం లక్ష్యం పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచడం, తల్లుల ఆర్థిక భద్రత, విద్యా ఖర్చులు తల్లులపై భారం తగ్గించడం. అంతేకాదు విద్యార్థుల డ్రాప్ అవుట్ కూడా తగ్గిస్తుంది.
ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు అప్లికేషన్ ప్రక్రియ అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచారు. అయితే ఈ పథకానికి అర్హత సాధించాలంటే ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఉండకూడదు . కుటుంబంలో మూడు ఎకరాల కంటే ఎక్కువ సాగు భూమి ఉండకూడదు. 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించకూడదు.
ఈ పథకం గత ప్రభుత్వం 'అమ్మఒడి' పేరుతో ప్రారంభించింది.ఈ పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి ఒకసారి విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.15000 జమ చేయనుంది.
Also Read: రైతులకు బిగ్‌షాక్.. పీఎం కిసాన్ 20వ విడుత రూ.2000 డబ్బులు వీళ్లకు పడవు..!
Also Read: ఈ చిన్న తప్పులు ఆధార్ కార్డులో ఉంటే.. ప్రభుత్వ పథకాలకు అనర్హులు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









