AP Inter Results: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్..దుమ్మురేపిన అమ్మాయిలు

AP Inter Results 2025: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ ను మంత్రి నారాలోకేశ్ విడుదల చేశారు. 

Written by - Bhoomi | Last Updated : Apr 12, 2025, 11:29 AM IST
AP Inter Results: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్..దుమ్మురేపిన అమ్మాయిలు

AP Inter Results 2025: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ ను మంత్రి నారాలోకేశ్ విడుదల చేశారు. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ కీలక అప్ డేట్ ఇచ్చింది. సప్లిమెంటీర పరీక్షల తేదీలను ప్రకటించేసింది. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15వ తేదీ  నుంచి ఫీజులు చెల్లించవచ్చు. ఏప్రిల్ 22వ తేదీ వరకు గడువు ఉంటుందని పేర్కొంది. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఉదయం 9గంటల నుంచి 12 గంటలకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 

Add Zee News as a Preferred Source

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 నమోదు అయ్యింది. గత పదేళ్లలో అత్యధికం ఇది. మొదటి ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47గా ఉంది. ఇది గత 10ఏళ్లలో రెండవ అత్యధికంగా ఉంది. కాగా ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో గత 10ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యింది. మొదటి ఏడాది విద్యార్థులు 70శాతం, సెకండ్ ఇయర్ విద్యార్థుల ఉత్తీర్ణత 83శాతంగా నమోదు అయ్యింది. ప్రభుత్వం ఆధ్వర్యంలోని సంస్థల్లో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించిందని మంత్రి నారాలోకేశ్ తెలిపారు. 

ఈ ఏడాదికి సంబంధించి ఏపీ ఇంటర్ పరీక్షలు మార్చి 20వ తేదీన ముగిశాయి. ఆ వెంటనే బోర్డ్ స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఫలితాలను వేగంగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టింది. మొత్తం 25కేంద్రాల్లో మార్చి 17 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మొత్తం 4 విడతల్లో పూర్తి చేశారు. కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా పూర్తవ్వడంతో నేడు ఫలితాలను విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 10 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. 

ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు hi అని మెసేజ్ చేయండి.  

ఆ తర్వాత సెలెక్ట్ సర్వీస్ లో విద్యాసేవలు సెలక్ట్ చేసుకోండి

డౌన్ లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 ఆప్షన్ పై క్లిక్ చేయాలి

మార్కుల మెమో పొందడానికి మీ హాల్ టికెట్ నెంబర్ ను నమోదు చేయండి

పీడీఎఫ్ రూపంలో ఫలితాలు కనిపిస్తాయి. విద్యార్థులు విద్యామండలి అధికారిక వెబ్ సైట్ https://resultsbie.ap.gov.in/కి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News