)
Vinayaka Chavithi: ప్రజల మధ్య ఐక్యత.. సామరస్యతను పంచేది వినాయక చవితి పండుగ. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా వినాయక చవితి అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఊరు వాడ ఒక్కటై నవరాత్రులు న భూతో న భవిష్యత్ అనే రీతిలో జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని గ్రామాలు మాత్రం వినాయక చవితి అస్సలు చేసుకోరు. ముఖ్యంగా రెండు గ్రామాల ప్రజలు వినాయక చవితిని బహిష్కరించినట్టు చేస్తారు. దశాబ్దాలుగా ఆ గ్రామాలు వినాయక చవితిని చేసుకోవడం లేదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
అనంతపురం జిల్లా బసంపల్లి, విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలోని లచ్చిరాజుపేట గ్రామం ఈ రెండింటిలో వినాయక చవితిని చేసుకోరు. పక్క గ్రామాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నా కూడా ఈ గ్రామస్తులు వినాయక చవితి చేసుకోవడానికి ఇష్టపడరు. ఒక గ్రామంలో అయితే ఒక విశ్వాసంతో చేసుకోవడం లేదు. మరో గ్రామంలో అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయని భావించి వినాయక చవితిని చేసుకోవడం లేదు.
అనంతపురం జిల్లా బసంపల్లి గ్రామంలో వినాయక చవితి పండుగను చేసుకోకపోవడానికి ప్రధాన కారణం ఉంది. ఈ గ్రామ దేవత మారెమ్మ జాతర వినాయక చవితికి ముందు వస్తుంది. దీని కారణంగా చేసుకోవడం లేదు. మారెమ్మ జాతర తర్వాత వినాయక చవితి ఉత్సవాలు చేసుకుంటే గ్రామం పవిత్రత పోతుందని ఆ గ్రామస్తులు భావిస్తున్నారు. మారెమ్మ జాతర జరిగిన కొద్దిరోజులకే వినాయక చవితి పండుగ రావడంతో అప్పటి చేసుకున్న సంబరం మరచిపోతామని.. తమ గ్రామ జాతర తగ్గిపోతుందని భావించి గ్రామస్తులు వినాయక చవితి చేసుకోవడం లేదు. అమ్మవారి జాతర కారణంగానే వినాయక చవితి చేసుకోకపోవడం వింతగా ఉంది.
చేసుకుంటే విషాదం
విజయనగరం జిల్లా లచ్చిరాజం పేట గ్రామంలో వినాయక చవితి అంటే చాలు విషాద సంఘటనలు గుర్తుకువస్తాయి. ఆ గ్రామంలోని ఎవరినీ అడిగినా. వినాయక చవితి వద్దు అని చెబుతారు. దశాబ్దాలుగా ఈ గ్రామంలో వినాయక ఉత్సవాలు చేసుకోవడం లేదు. దాదాపు రెండు దశాబ్దాల కిందట వినాయకచవితి పనులు చేస్తుండగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా చనిపోయాడు. దీంతో ఆ ఏడాది చేసుకోలేదు. తర్వాతి సంవత్సరం వినాయక చవితి చేసుకునేందుకు సిద్ధమవగా మరొకరు చనిపోయారు.
ఇలా వరుసగా మూడుసార్లు జరగడంతో ఆ గ్రామస్తులు వినాయక చవితిని చేసుకోవడం ఆపేశారు. అదంత గతం అని భావించి కొందరు 2019లో వినాయక చవితిని చేసుకునేందుకు సిద్ధం కాగా ఓ మహిళ మృతి చెందింది. దీంతో వినాయక చవితి చేసుకోవాలనే ఆలోచనకు బంద్ పెట్టారు. వినాయక చవితి చేసుకుంటే గ్రామంలో విషాదం చోటుచేసుకుంటుందనే కారణంగా లచ్చిరాజంపేట గ్రామస్తులు ఈ పండుగకు దూరం ఉంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.