తిరుపతి ఆలయంలో బంగారు కిరీటాలు మాయం : చోరీ చేసిందెవరు ?

                           

Updated: Feb 4, 2019, 10:35 AM IST
తిరుపతి ఆలయంలో బంగారు కిరీటాలు మాయం : చోరీ చేసిందెవరు ?

తిరుపతిలోని గోవిందరాజుస్వామి ఆలయంలో కిరీటాలు మాయమైన కేసు దర్యాప్తును పోలీసులు  ముమ్మరం చేశారు. దొంగలను పట్టుకునేందుకు  ఆరు ప్రత్యేక బృందాల  ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆలయం నుంచి బయటికి వెళ్తున్న అనుమానిత ఓ వ్యక్తిని సిసి ఫూటేజ్ ద్వారా గుర్తించిన పోలీసులు..నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ కేసుతో సంబంధం ఉందని భావించి మరికొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కిరిటాల మాయం కేసులో ఆలయ అధికారుల హస్తం ఉందా..బయటికి నుంచి వచ్చిన భక్తులే ఈ కిరీటాలు ఎత్తుకువెళ్లారా అన్న కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది.

చోరీకి గల కారణాలపై ఈవో రియక్షన్

మరోవైపు స్వామివారి కిరిటాలు దొరక్కపోవడంతో ఆందోళనలో భక్తులు ఉన్నారు .ఈ కిరీటాల మాయం ఘటనపై ఆలయ  ఈవో స్పందిస్తూ చోరీకి సంబంధించి కచ్చితమైన సమాచారం ఉందని..చోరీకి గురైన కిరీటాలు తప్పకుండా రికవర్ చేస్తామంటున్నారు. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం, ఇంటిదొంగలతో కిరిటాలు మాయమైనట్లు అధికారులు నిర్ధారించారు.

కల్యాణ వెంకటేశ్వరస్వామి కిరీటాలు..

టీడీపీ పరిధిలో ఉన్న ప్రధాన ఆలయాల్లో గోవిందరాజ స్వామి ఆయలం ఒకటి. ఈ ఆలయ ప్రాగణంలో 18 ఉప ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటైన కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులకు వినియోగించే మూడు బంగారు కిరీటాలు మాయం కావడం స్థానికంగా సంచలన సృష్టిస్తోంది. రెండు రోజుల ముందు చోరీ ఘటన చోటు చేసుకుంది. కిరిటాల మాయంపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు