)
Thunderstorm Heavy rains warning to andhra pradesh: ఆంధ్ర ప్రదేశ్ లో గత కొన్నిరోజులుగా కుండపోతగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో జనాలు అసలు బైటకు వెళ్లాలంటనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ఏపీ విపత్తు నిర్వాహణ సంస్థ కీలక హెచ్చరికల్ని జారీ చేసింది.
ముఖ్యంగా.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల భారీ వర్షాలతో పాటు, పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులుకూడా వేచే అవకాశం ఉందని, మత్య్సకారులు వేటకు వెళ్లకూడదని, అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో.. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అల్లూరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలతో పాటు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఇప్పటికే భారీ వర్షాలతో ఉత్తారంధ్రా జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి.
తాజాగా హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు పలు సూచనలు జారీ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook