Tirumala News: తిరుమల క్యూలైన్ లో షాకింగ్ ఘటన.. తలలు పగిలేలా కొట్టుకున్న భక్తులు.. ఏమైందంటే..?.. వీడియో వైరల్..

ttd news: తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులు  క్యూలైన్ లలో గొడవలుపడ్డారు. అంతే కాకుండా.. తలలు పగిలేలా కూడా కొట్టుకున్నారు. వెంటనే తిరుమల విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 20, 2025, 07:57 PM IST
  • తిరుమలలో కొట్టుకున్న భక్తులు..
  • చర్యలు తీసుకొవాలని భక్తుల డిమాండ్..
Tirumala News: తిరుమల క్యూలైన్ లో షాకింగ్ ఘటన.. తలలు పగిలేలా కొట్టుకున్న భక్తులు.. ఏమైందంటే..?.. వీడియో వైరల్..

Argument between devotees in Tirumala: తిరుమల శ్రీవారిని భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకుంటారు.  గంటల కొద్ది క్యూలైన్ లలో వేచీ ఉంటారు. ఇటీవల ఏపీలో అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకొవాలని ఆదేశించింది. సామాన్య భక్తులే టార్గెట్ గా చర్యలు  తీసుకొవాలని టీటీడీ సూచించింది.ఈ క్రమంలో టీటీడీ కూడా తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Add Zee News as a Preferred Source

ఇటీవల టీటీడీ తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు రాజనీయ నాయకులు ఇచ్చే సిఫారసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 24 నుంచి  సిఫారసు లెటర్లను అనుమతిస్తామని టీటీడీ ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడించిన విషయం తెలిసిందే. సమ్మర్ లో తిరుమలకు భక్తులు భారీగా వస్తుంటారు. అందుకే తిరుమలలో టీటీడీ ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేసింది.  అయితే.. తాజాగా.. ఆధ్యాత్మిక ప్రదేశంలో భక్తులు కొట్టుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 

 

 తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొంతమంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. క్యూలైన్లలో కూర్చునే విషయంలో మధ్య గొడవ జరిగింది . తొలుత మాటల యుద్దం, అది కాస్త కొట్టుకొవడం వరకు వెళ్లింది. ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న గాజు గ్లాసుతో మరో వ్యక్తి తల మీద కొట్టాడు. దీంతో తీవ్రగాయమైంది. వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. గాయపడ్డవ్యక్తిని తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు.

Read more: Snake ring: జీవితంలో ఏదీ కలిసి రావట్లేదా..?.. స్నేక్ రింగ్‌ను ఇలా ధరించండి.. వంద శాతం మీకు కలిగే ఫలితాలివే..!

అయితే తమ పిల్లాణ్ని బలవంతంగా నెట్టేశారని, ఇదేమిటని ప్రశ్నిస్తే గొడవకు దిగారని దాడి చేసిన భక్తులు చెబుతున్నాడు. ఈక్రమంలో పోలీసులు అక్కడ విచారణ చేపట్టారు.సీసీ కెమెరాలను పరిశిలిస్తున్నారు. గాయపడిన వ్యక్తికి ప్రాణాపాయం లేదని.. తలకు మాత్రం బలమైన గాయమైనట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనతో మిగతా భక్తులకు ఆందోళనకు గురయ్యారు. దేవుడి దగ్గరకు వచ్చి ఇలాంటి పనులు చేయడమేంటని భక్తులు మండిపడుతున్నారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News