Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులకు బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి కొత్త తరహా మోసం..!.. ఇలా కూడా చేస్తారా..?. .

Bangalore devotees in Tirumala: బెంగళూరుకు చెందిన శ్రీవారి భక్తులు ఇటీవల స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో నిల్చొని ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి దగ్గర టికెట్ లను విజిలెన్స్ అధికారులు చెక్ చేశారు. ఆ తర్వాత భక్తులు అసలు విషయం తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 16, 2025, 06:33 PM IST
  • తిరుమలలో మోసపోయిన భక్తులు..
  • విచారణ చేపట్టిన విజిలెన్స్ సిబ్బంది..
 Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులకు బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి కొత్త తరహా మోసం..!.. ఇలా కూడా చేస్తారా..?. .

Tirumala Darshan Tickets Cheating: తిరుమలలో ఇటీవల భక్తులు రద్దీ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ టీటీడీ రాజకీయ నేతల నుంచి  సిఫారసుల లెటర్లను తిరిగి తీసుకుంటామని ప్రకటించింది. దీంతో మరల ఒక్కసారిగా తిరుమలలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది.

Add Zee News as a Preferred Source

అయితే..  తిరుమలలో ఇటీవల దర్శనం టికెట్ ల విషయంలో అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. టీటీవీ విజిలెన్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్న కూడా.. కొంతమంది అవినీతి వాళ్ల వల్ల.. మోసాలు జరుగుతునే ఉన్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన కొంత మంది భక్తులు అడ్డంగా దళారుల చేతిలో మోసపొయారు.  వర్షా ట్రావెల్స్ ద్వారా వచ్చిన 35 మంది భక్తులు ఇటీవల ఒక ట్రావెల్స్ నుంచి శ్రీవారి దర్శనం కోసం టికెట్లను కొనుగోలు చేశారు. 

ఒక్కొక్కరి నుంచి రూ. 4000 వరకు వసూలు చేశారు. క్యూలైన్‌లో టీటీడీ అధికారుల టికెట్లను తనిఖీలు చేయగా అవి నకిలీవని విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భక్తుల తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. ఎంతో దూరం నుంచి భక్తులు వ్యయప్రయాసాలకు పడి వచ్చామని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ దళారుల్ని, ట్రావెల్స్ వాళ్లను నమ్మకూడదని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై టీటీడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం  తిరుమలలో తీవ్ర చర్చనీయాంశంగా  మారింది.

Read more: King Cobra Video: అద్భుతం.. ప్రెగ్నెంట్ కప్ప మీద పడగ విప్పి మరీ నిల్చున్న పాము.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..

మొత్తంగా..ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ప్రస్తుతం తిరుమలలో.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ కోటా దర్శనం, సర్వదర్శనం వంటి అవకాశాల్ని  భక్తులకు టీటీడీ అందిస్తుంది. అంతే కాకుండా.. ప్రత్యేక కౌంటర్ లు ఏర్పాటు చేసి మరీ  టీటీడీ భక్తులకు టికెల్ లను అందిస్తుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News