TTD Board Meeting: తిరుమలలో 'వీఐపీ సంస్కృతికి' బ్రేక్‌? టీటీడీ పాలకమండలి నిర్ణయాలు ఇవే!

TTD Board Meeting Decisions: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర ఆలయ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే వీఐపీ సంస్కృతికి 'బ్రేక్‌' ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాలు తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 24, 2025, 05:02 PM IST
TTD Board Meeting: తిరుమలలో 'వీఐపీ సంస్కృతికి' బ్రేక్‌? టీటీడీ పాలకమండలి నిర్ణయాలు ఇవే!

TTD Board Meeting: ఆలయ పవిత్రతను కాపాడడంతోపాటు భక్తులకు స్వామివారి సేవలు సులభతరంగా అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే వీఐపీ బ్రేక్‌ దర్శనం విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా తిరుమల సేవలు విస్తరించాలని నిర్ణయించింది. ఇక ఉద్యోగులు, ఆలయ సేవలపై పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: YS Jagan: 'మూడేళ్లు ఓపిక పట్టండి.. వచ్చేది మన ప్రభుత్వమే': మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

 

రూ.5,258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదంతెలిపింది. ఈ సందర్భంగా ఒంటిమిట్ట కోదండరామ బ్రహ్మోత్సవాలను పోస్టర్లను పాలకమండలి విడుదల చేసింది. ఈనెల 21వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు అమలు చేస్తామని తెలిపారు. ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేసినట్లు ప్రకటించారు. 50 ఎకరాలు టీటీడీ స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మాణం చేయాలని నిర్ణయించినట్లు చైర్మన్‌ వెల్లడించారు. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కమిటీ వేస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read: TDP Why Not Kadapa: వైనాట్ కడప.. జగన్ అడ్డాలో తెలుగుదేశం 'భారీ వ్యూహం'

టీటీడీ నిర్ణయాలు ఇవే..

  • శ్రీవారి భూముల కేసులు న్యాయస్థానాల్లో వాటిని త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు
  • టీటీడీ ఉద్యోగులు హిందువు అయి ఉండాలి
  • అన్ని రాష్ట్రాల రాజధానిలో ఆలయాల నిర్మాణం చేస్తాం
  • ఒకటిన్నర ఏడాది కొన్ని ఆలయాలు నిర్మాణం చేయాలి.
  • పోర్టు కార్మికులకు ఇచ్చే రూ.43 వేలు జీతంలో కట్‌ చేస్తున్న రూ.5 వేల జీఎస్టీను అందించాలని నిర్ణయం
  • సైన్స్ సిటీకి కేటాయించిన 20 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేయకపోవడంతో వాటిని తిరిగి స్వాధీననం
  • తిరుమలలో అనధికార హకర్లపై చర్యలు తీసుకుంటాం
  • త్వరలో వీఐపీ బ్రేక్ దర్శన సమయ మార్పు చేస్తాం
  • ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ప్రయోగాత్మకంగా ట్రయల్ నిర్వహణ
  • 1,500 గదుల మరమ్మతులు కోసం రూ.26 కోట్లు విడుదలకు నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News