Tirumala Video: ఇదెక్కడి ఘోరం గోవిందా.. తిరుమల క్యూలైన్లలో కొట్టుకున్న భక్తులు.. వీడియో వైరల్..

Ttd news: తిరుమలలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో నిల్చొని ఉన్నారు. ఇంతలో తోపులాట జరిగింది. దీంతో భక్తులు క్యూలైన్లలోనే తిట్టుకుంటూ, కొట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : May 4, 2025, 11:45 AM IST
  • తిరుమలలో కొట్టుకున్న భక్తులు..
  • టీటీడీ సిబ్బంది సీరియస్..
Tirumala Video: ఇదెక్కడి ఘోరం గోవిందా.. తిరుమల క్యూలైన్లలో కొట్టుకున్న భక్తులు.. వీడియో వైరల్..

Devotees arguments each other in Tirumala: తిరుమల శ్రీవారిని భక్తులు కలియుగ దైవంగా, కొంగు బంగారంగా భావిస్తారు. పిలిస్తే పలికే దైవంగా భావించి స్వామి వారికి తమ కోరికలు తీర్చమని మొక్కలు మొక్కుకుంటారు. వాటి కోసం మొక్కులు కూడా చెల్లిస్తారు.  వెంకటేశ్వర వారి దర్శనం కోసం ఎన్నిగంటలైన క్యూలైన్లలో వేచి ఉంటారు. ఆయన దర్శనం కోసం భక్తులు ఎంతో పరితపిస్తుంటారు.  అయితే.. ఇటీవల తిరుమల తరచుగా వివాదాల పరంగా వార్తలలో ఉంటుంది.

Add Zee News as a Preferred Source

టీటీడీ ఎన్ని చర్యలు తీసుకున్న కూడా తిరుమలలో మాత్రం వివాదాలు ఆగడంలేదు. తాజాగా.. కొంత మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో కొట్టుకున్న ఘటన వార్తలలో నిలిచింది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో ముందువైపు ఉన్న భక్తుల్ని .. వెనుక ఉన్న వారు బలంగా ముందుకు నెట్టారు. ఈ క్రమంలో వీరి మధ్య వాగ్వాదం జరిగి కొట్టుకునే వరకు వెళ్లింది.

 

అక్కడే ఉన్న టీటీడీ సిబ్బంది అడ్డుకున్న కూడా వారి ఆగలేదు. కొద్ది సేపు తిట్టుకుని, తోపులాట జరిగింది.   దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడున్న వారిని సముదాయించి స్వామి దర్శనం కోసం లోనికి పంపించారు. ఈ ఘటనను అక్కడున్న కొంత మంది భక్తులు తమ ఫోన్ లలో రికార్డు చేశారు. అది ప్రస్తుతం వైరల్గా మారింది. ఇక మరోవైపు ఇటీవల క్యూలైన్లలో గాజు బాటిల్ తో ఒక భక్తులు కోపంతో.. మరో భక్తుడి తల మీద కొట్టిన సంగతి తెలిసిందే.

Read more:Modi Surprise gift to Pawan Video: పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ముందే సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మోదీ.. వీడియో ఇదే..

ఆ తర్వాత టీటీడీ వారు గాజు బాటిల్ ను అనుమతించేందుకు నిరాకరించారు. మరోవైపు కొంత మంది భక్తులు ఇటీవల చెప్పులు వేసుకుని మరీ స్వామివారి బంగారు వాకిలి లైన్ వరకు వచ్చారు. దీనిపై టీటీడీ సీరియస్ అయ్యింది. అక్కడ డ్యూటీలో ఉన్న ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేసింది.ఈ క్రమంలో ప్రస్తుతం భక్తులు కొట్టుకున్న ఘటన చూసి.. నెటిజన్లు ఆశ్చర్యంవ్యక్తం చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News