vada served at Tirumala annaprasadam: తిరుమల శ్రీవారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. పిలిస్తే పలికే దైవంగా, భక్తులు తమ కొంగు బంగారంగా నమ్ముతుంటారు. అంతే కాకుండా.. స్వామి వారి కోసం మనదేశం నుంచి మాత్రమే కాకుండా, విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తుంటారు. కొంత మంది భక్తులు నడక మార్గంలో వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. మరికొందరు నేరుగా ఘాట్ రోడ్డు మార్గంలో కూాడా కూడా కొండ మీదకు వెళ్తుంటారు. శ్రీవారిని చూడటానికి ఎన్నిగంటలైన క్యూలైన్లలో వేచి ఉంటారు. అయితే ప్రస్తుతం ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు తిరుమలలో పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంది.
ఇటీవల టీటీడీ కొత్త బోర్డ్ ను నియమించింది. ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడును నియమించింది. అయితే.. తిరుమలలో ఎక్కడ కూడా స్వామి వారి కైంకర్యాలలో లోపంలేకుండా.. చూడాలని అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సైతం.. టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తిరుమలకు వచ్చే భక్తులకు పెద్దపీట వేసే విధంగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే తిరుమలలో వీఐపీలకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే చర్యలను తగ్గించి, సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే విధంగా టీటీడీ చర్యలు చేపట్టింది.
అయితే.. తిరుమలకు ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ ఉచితంగా అన్న ప్రసాదం కల్పిస్తుంది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ ఇటీవల భక్తులకు అన్న ప్రసాదంలో.. మసాలా వడను చేర్చే అంశంపై సంప్రదింపులు జరిపారు. దీనిపైన గతేడాది నవంబరు 18న టీటీడీ పాలకమండలి తీర్మానించింది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది.
నేటి నుంచి తిరుమలలో.. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కేంద్రంలో నేటి నుంచి అన్నప్రసాదంలోకి మరో ఐటెమ్‌ను చేర్చారు. ప్రత్యేకంగా రుచికరమైన శెనగపప్పు వడల్ని భక్తులకు వడ్డించేలా ఏర్పాట్లు చేశారు.
ఈ రోజు భక్తులకు అన్న ప్రసాదంలో వడపప్పుకు శ్రీకారం చుట్టారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు,ఈవో స్వయంగా స్వామివారి భక్తులకు వడపప్పును వడ్డన చేశారు. కొత్త వంటకం పట్ల.. భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, చైర్మన్ వెల్లడించారు. ప్రతిరోజు భక్తులకు రుచికరమైన వడగారెను వడ్డించేలా ఏర్పాట్లు చేస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









