Tirumala: తిరుమలలో ఘనంగా వసంతోత్సవాలు..

Tirumala:తిరుమలలో వసంతోత్సవం కన్నుల పండువగా ప్రారంభమైంది. ఎండ వేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతోపాటు పలురకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 11, 2025, 03:29 PM IST
Tirumala: తిరుమలలో ఘనంగా వసంతోత్సవాలు..

Tirumala: వసంతోత్సవాల్లో భాగంగా  శ్రీ భూదేవీ సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనతో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనస ఆగమోక్తంగా చేపట్టారు.

Add Zee News as a Preferred Source

ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడి నుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణ రథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుంచి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణ రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడంవల్ల - లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారి కరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం. వసంతోత్సవంలో  స్వర్ణరథంపై మాఢ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు మళయప్ప స్వామి. రథంను పెద్ద సంఖ్యలో మహిళ భక్తులు లాగి స్వామి వారిని దర్శించుకున్నారు.

మరోవైపు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, వైజాగ్ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ రాణి, ఏపీ ఎలక్షన్ కమిషనర్ నీలం సహాని వేరు వేరుగా దర్శించుకున్నారు. వైకుంఠం కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి అభిషేకం సేవ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

వసంతోత్సవాల్లో రెండవ రోజైన ఇవాళ శ్రీ భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై తిరుమాడ వీధులలో ఊరేగారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News