)
Ttd key update on Tirumala darshan after lunar eclipse effect: దేశమంతట కూడా రాహుగ్రస్త చంద్ర గ్రహణం నేపథ్యంలో ఆలయాలు అన్ని కూడా క్లోజ్ చేశారు. అంతే కాకుండా.. రేపు తెల్లవారు జామున ఆలయంలో శుద్ది పూజల అనంతరం మరల ఆలయాల్ని తెరవనున్నారు. మరోవైపు కలియుగ దైవం, తిరుమలలో కూడా ఇప్పటికే ఆలయాన్ని పండితులు మూసివేశారు.
సన్నిధి బంగారు వాకిలికి తాళం వేయడంతో ఆలయ మూసివేత ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రభావంతో సుమారు 12 గంటలకు పైగా శ్రీవారి దర్శనాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. మరల సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారని అధికారులు వెల్లడించారు.. అనంతరం ఆలయంలో శుద్ధి, పుణ్యాహవచనం వంటి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆ తర్వాత మరల..సర్వదర్శనం కోసం వచ్చే భక్తులను సోమవారం వేకువజామున 2 గంటల నుంచి క్యూలైన్లలోకి అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో శ్రీవారి ఆలయంలో శుద్ది కార్యక్రమాలు అయిన తర్వాత మరల అందరికి యథాతథంగా స్వామి వారి దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
గ్రహణం కారణంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. సుమారు 50 వేల పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచింది. గ్రహణం నేపథ్యంలో వీఐపీతో పాటు, ఇతర కైంకర్యాల్ని టీటీడీ ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.