)
Tirumala January 2026 Quota Tickets: తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రత్యేక దర్శనం.. ఆర్జిత సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులకు శుభవార్త. జనవరి కోటాకు సంబంధించి టీటీడీ అధికారులు తేదీలు ప్రకటించారు. ముందే కొత్త సంవత్సరం.. ఆపై సంక్రాంతి ఉత్సవాలు ఉండడంతో జనవరిలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ముందస్తు బుక్ చేసుకుని వెళ్తే తిరుమల శ్రీవారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకోవచ్చు. టీటీడీ విడుదల చేసిన జనవరి కోటా తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్స్ వివరాలు
శ్రీవారి అర్జిత సేవలు, అంగప్రదక్షిణం టిక్కెట్లు, ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు జనవరి-2026 ఈనెల 19వ తేదీ ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. రిజిస్ట్రేషన్లు ఈనెల 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఈనెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు బుకింగ్ చేసుకోవచ్చు.
జనవరి-2026లో కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి సేవల కోసం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈనెల 23వ తేదీ 10 గంటలకు బుకింగ్ కోసం అందుబాటులో ఉంచుతారు. ఈ టికెట్లు అత్యధికంగా అమ్ముడవుతాయి. భక్తులు త్వరపడాల్సి ఉంటుంది.
==> జనవరి-2026న తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల కోసం ఆన్లైన్ సేవ (వర్చువల్ పార్టిసిపేషన్), కనెక్ట్ చేయబడిన దర్శన కోటా ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాయి.
==> జనవరి-2026కి సీనియర్ సిటిజన్లు / దివ్యాంగుల కోటా ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాయి
==> జనవరి-2026 కి ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లు ఈనెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. వీటికి అధిక డిమాండ్ ఉంటుండడంతో భక్తులు త్వరగా బుక్ చేసుకోవాలి.
==> జనవరి-2026కి తిరుమల, తిరుపతిలో వసతి కోసం ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బుకింగ్స్ మొదలవుతాయి.
==> తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.200 టికెట్లు నవంబర్ నెలకు సంబంధించి ఈనెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి.
==> నవంబర్-2025 కి సంబంధించిన టీటీడీ - స్థానిక దేవాలయాల సేవా టికెట్లు ఈనెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి.
The January 2026 quota is here!
Arjitha Seva, Special Entry Darshan, and Accommodation quotas will be released as per the schedule.
Book only through our official website or TTD mobile app: https://t.co/YNfciaT1OD
Do not trust middlemen.#TTD #Tirumala pic.twitter.com/XO3dyww23l— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) October 17, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook