)
Man Bites Snake In Tirupati: ఎవరైనా మనపై దాడి చేసినా తిరిగి ప్రతిదాడి చేయడానికి కొన్నిసార్లు ఆలోచిస్తాము. కొందరైతే ప్రతిదాడి చేసేంత వరకు వారికి నిద్ర పట్టదు. అలాంటి ఓ సంఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరిగింది. ఓ వ్యక్తి మద్యం తాగి ఉండగా అతడ్ని ఓ పాము కాటేసింది. అయితే పాము కాటేసిందని దానిపై కోపంతో ఆ మందు బాబు విచిత్రమైన పని చేశాడు. ఆ పామును వెంటాడి దాని తలని గట్టిగా కొరికేశాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడే కూడా అతనికి తెలియరాలేదు. ఆ వెంటనే ఆ పాము తలతో రెండు ముక్కలైంది. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
పాము కాటుకు గురైన వ్యక్తి!
ఈ వింత సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరిగింది . శుక్రవారం నాడు వెంకటేష్ అనే వ్యక్తి మద్యం తాగి ఉన్నాడు. బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఒక పెద్ద నల్ల నాగుపాము అతన్ని కాటు వేసింది. ఇది చూసిన కోపంగా ఉన్న వ్యక్తి పామును ఒకే దెబ్బతో పట్టుకుని, దాని తలను కొరికి పారేశాడు.
వెంకటేష్ చనిపోయిన పామును చేతిలోకి తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అప్పటికే అతను బాగా తాగి ఉన్నాడు. చనిపోయిన పామును తన దగ్గరగా ఉంచుకుని పడుకున్నాడు. ఈ సంఘటనను ప్రత్యక్ష సాక్షులు కొందరు మాట్లాడుతూ, వెంకటేష్ తాను చంపిన పాముతో పెద్ద బహుమతిలా ఫీల్ అవుతూ నిద్రపోవాలని అనుకున్నాడట.
క్లిష్ట పరిస్థితిలో చికిత్స!
తాను చంపిన పామును తీసుకెళ్లిన వెంకటేష్, దాని పక్కనే ఉంచి నిద్రిస్తున్నాడు. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే విషం అతని శరీరంలోకి ప్రవేశించడం ప్రారంభించిందని చెబుతారు. కొన్ని గంటల్లోనే అతను మాట్లాడటం మానేశాడు. దీని తరువాత ఆందోళన చెందిన అతని కుటుంబం అతన్ని శ్రీకాళహస్తిలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ అతనికి అత్యవసర చికిత్స అందించగా.. తరువాత అతన్ని అత్యవసర విభాగంలో చేర్చినట్లు చెబుతారు.
వెంకటేష్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని.. శుక్రవారం ఉదయం ఆయనను తిరుపతిలోని మరో ఆసుపత్రికి తరలించారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతోంది. వైద్య బృందం ఆయనను నిశితంగా పరిశీలిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook