Tirupati: తిరుపతి పుణ్యక్షేత్రంలో పబ్బు గబ్బు.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!

Tirumala-Tirupati: పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రం సమీపంలో.. పబ్బు నిర్వహణ పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఈ విషయం సంచలనంగా మారడమే కాకుండా ఈ విషయం తెలిసిన యావత్తు ప్రపంచ వెంకటేశ్వర స్వామి భక్తులు అసహనం వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై మండిపడుతున్నట్లు సమాచారం. 

Last Updated : Dec 18, 2024, 10:20 AM IST
Tirupati: తిరుపతి పుణ్యక్షేత్రంలో పబ్బు గబ్బు.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!

Tirupati Pub: తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలియుగ దేవుడిగా భక్తులకు దర్శనం ఇస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఒకవైపు అన్య మతస్తులు ప్రచారం చేస్తుండగా.. మరొకవైపు ఇలా పబ్బు పేరిట  గబ్బు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

Add Zee News as a Preferred Source

పాశ్చాత్య సంస్కృతులకు అలవాటు పడిన యువత ఇప్పుడు పబ్ మోజులో పడి అసలు మనం ఏం చేస్తున్నాము అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ప్రవర్తిస్తున్నారు. స్వామివారి సన్నిధిలో ఇలాంటి అపచారాలు కలియుగ అంతానికి సూచనగా నిలుస్తున్నాయని పలువురు పండితులు చెబుతున్నారు. 

ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ అయ్యిందనే ఆరోపణలు రావడంతోనే.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటూ పలువురు నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
నాడు జగన్ ప్రభుత్వంలో కల్తీ జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ దీక్ష పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లు శుభ్రం చేస్తూ కనిపించిన పవన్ కళ్యాణ్,  నేడు జగన్ ప్రభుత్వం కాదులే మన ప్రభుత్వంలో తప్పులు జరగవని కళ్ళు మూసుకున్నారా లేక నిజంగానే గుడ్డివాడయ్యాడా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం. 

తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరలో ఉండే చంద్రగిరి ప్రాంగణంలో ఈ పబ్బు నిర్వహణ జరుగుతోందని,  ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ పబ్బు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 12 వరకు ఈ పబ్బు నిర్వహణ ఉంటుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని,  లేకపోతే తిరుమల పవిత్రతను కోల్పోయే అవకాశం ఉందని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

ఇదీ చదవండి: ధాన్యలక్ష్మి పేరు చెబితేనే వణికిపోతున్న కావ్య.. అయ్యయ్యో గుండెనొప్పితో కుప్పకూలిన అమ్మమ్మ

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News