)
Liquor Scam By CBN: కల్తీ మద్యం రాకాసి ఆంధ్రప్రదేశ్‌ను పీల్చేస్తుండడంతో అమాయక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నకిలీ మద్యంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గం నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా హల్చల్ చేశారు. నారా వారి సార పాలన నశించాలి అంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం, కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టగా నగరిలో రోజా ఆ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. నకిలీ మద్యంతో చనిపోయిన వారికి అండగా వైసీపీ పోరాటం చేస్తోందని.. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నంలో 20 వేల లీటర్ల నకిలీ మద్యం దొరికింది అని గుర్తుచేశారు. చంద్రబాబు, లోకేష్ మద్దతు లేకుండా నకిలీ మద్యం తయారీ చేయగలరా అని ప్రశ్నించారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదని సూచించారు. తమపై నకిలీ మద్యం లిక్కర్ కేసులు పెట్టారని.. ఇప్పుడు నిజంగానే వారు దొరికారు అని మాజీ మంత్రి రోజా తెలిపారు.
జయచంద్రారెడ్డి వైసీపీ కోవర్టు అయితే చంద్రబాబు ఎలా ఎమ్మెల్యే సీటు ఇచ్చాడు అని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. చంద్రబాబు అనుభవం అంతా అవినీతి డబ్బు కోసమే.. చంద్రబాబు సిగ్గు లేకుండా సిట్ వేస్తానని చెబుతున్నాడని మండిపడ్డారు. సిట్‌తో ఉపయోగం లేదని సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్‌కు లిక్కర్ స్కాంలో ముడుపులు అందాయని ఆరోపించారు. ప్రశ్నించాల్సిన పవన్ సైలెంట్‌గా ఉన్నాడంటే అతడికి పెద్ద ప్యాకేజ్ అందిందని ఆరోపణలు చేశారు. కిలారి రాజేష్ ద్వారా నారా లోకేశ్‌కు మద్యం ముడుపులు అందాయని.. కల్తీ మద్యం అమ్మకాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు.
పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. మద్యం బాటిళ్లను చేతపట్టి కల్తీ మద్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం ఎక్సైజ్ అధికారి సురేశ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ.. అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం బాగోతం బయటపడటంతో కూటమి ప్రభుత్వంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాని ఆరోపించారు. కల్తీ మదయంలో ఎంతటి వారనైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లా
కల్తీ మద్యం పై నగరి ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకు మాజీ మంత్రి ఆర్కే రోజా గారి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
నారావారి సారా పాలన నశించాలంటూ నినాదాలు
మాజీ మంత్రి ఆర్కే రోజా నివాసం నుంచి నగిరి ఎక్సైజ్ కార్యాలయం వరకు వైఎస్సార్ కాంగ్రెస్… pic.twitter.com/I9aE3m5HTS
— YSR Congress Party (@YSRCParty) October 13, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి