Toll Tax: వాహనదారులుకు గుడ్ న్యూస్..ఆ రూట్లో భారీగా తగ్గిన టోల్ టాక్స్..

Toll Tax: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే  వాహనదారులకు శుభవార్త. నేటి అర్థరాత్రి నుంచి టోల్‌ టాక్స్‌ లు తగ్గనున్నాయి. ఈ మేరకు హైవేపై వెళ్ళే వాహనాలకు టోల్‌ రుసుములు తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ  నిర్ణయం తీసుకుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 31, 2025, 09:32 AM IST
Toll Tax: వాహనదారులుకు గుడ్ న్యూస్..ఆ రూట్లో భారీగా తగ్గిన టోల్ టాక్స్..

Toll Tax: నిత్యం హైదరాబాద్ నుంచి విజయవాడకు వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ఈ రూట్లో ఆర్టీసీ బస్సులతో పాటు ఎన్ని ప్రైవేటు బస్సులైన ప్రతి నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అలాంటి వారి జాతీయ రహదారుల సంస్థ శుభవార్త చెప్పింది.
అంతేకాదు తగ్గిన టోల్‌ రుసుములు మార్చి 31 అర్ధరాత్రి  నుంచి అమలులోకి రానున్నాయి.

Add Zee News as a Preferred Source

హైదరాబాద్‌-విజయవాడ  జాతీయ రహదారిపై తెలంగాణలో  పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. అత్యధికంగా పంతంగి టోల్‌ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్‌లకు  వన్‌ వే లో 15  రూపాయలు, టూ వే అయితే 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక  తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు ప్రయాణానికి 25 రూపాయలు , ఇరువైపులా కలిపి 40 రూపాయలు టాక్స్‌ కట్టాల్సి వుంటుంది.  బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి 50 రూపాయలు,  ఇరువైపులా కలిపి 75 వరకు తగ్గించారు.

చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు 5 రూపాయలు, ఇరువైపులా కలిపి 10 రూపాయలు చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్‌ రుసుములో 25 శాతం మినహాయింపు లభిస్తుంది. 2026 మార్చి 31 వరకు తగ్గిన టోల్‌ ధరలు అమలులో ఉండనున్నాయి.

ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!

ఇదీ చదవండి:  Jaya Prada Husband: నటి జయప్రద పెళ్లై ముగ్గురు పిల్లల తండ్రిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. షాకింగ్ నిజాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News