AP Intermediate Examinations: జీవితంలో కీలకమైన దశ ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం. ఉజ్వలమైన భవిష్యత్‌కు నాంది పలికే ఈ దశలో అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే బంగారు భవిష్యత్ సాధ్యమవుతుంది. అలాంటి కీలకమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏడాదంతా చదివినది పేపర్‌పై పెట్టాల్సిన సమయం వచ్చింది. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే. వాటితోపాటు ఇంటర్ పరీక్షల పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Also Read: YS Vijayamma: కొడుకు, కోడలుకు వైఎస్ విజయమ్మ ఝలక్! జగన్‌కు అర్హతే లేదు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. 20వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం.. ద్వితీయం సంవత్సరం విద్యార్థులకు మార్చి 3వ తేదీ సోమవారం నుంచి ప్రారంభమవనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి దాదాపు 10 లక్షల మంది పరీక్షలు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
Also Read: AP Budget: ఏపీ బడ్జెట్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలకు ఒక పేజీ?
విద్యార్థులకు జాగ్రత్తలు
- పరీక్ష కేంద్రాన్ని ఒకరోజు ముందే వెళ్లి చూసుకోవాలి. హాల్ టికెట్‌పై మీ వివరాలు సక్రమంగా ఉన్నాయో లేవో పరిశీలించాలి.
- హాల్ టికెట్‌లో ఏమైనా తప్పులు ఉంటే మీ కళాశాలలో సంప్రదించాలి.
- పరీక్షలపై టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇది కీలకమైన పరీక్షలు కావడంతో కంగారుతో తప్పులు చేసే అవకాశం ఉంది.
- నిర్ణీత సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి వెళ్లాలి.
- ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను పరీక్ష హాల్‌లోకి అనుమతించరు.
- పరీక్ష సమయంలో కాపీయింగ్‌కు లేదా చీటిలు పట్టుబడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









