Chandrababu House In Amaravati: విభజిత ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన పదకొండేళ్ల తర్వాత రాజధాని ప్రాంతంలో చంద్రబాబు తన సొంత నివాసాన్ని ఏర్పరచుకోనున్నారు. రాజధానిగా ప్రకటించిన అమరావతిలో ఇల్లు లేకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా రాజకీయంగా కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు చంద్రబాబు సొంత ఇంటిని నిర్మించుకోబోతున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి రేపు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.
Also Read: WhatsApp Governance: వాట్సప్ గవర్నెన్స్‌లో వెయ్యి సేవలే లక్ష్యం.. 15 నుంచి కొత్త కార్యక్రమం
రాజధానిగా అమరావతిని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఆ ప్రాంతంలో సొంతిల్లు లేదు. విభజన తరువాత కొన్నాళ్లు హైదరాబాద్‌లో నివాసం ఉన్న చంద్రబాబు అనంతరం కరకట్ట ఒడ్డున అద్దెకు నివసిస్తున్న విషయం తెలిసిందే. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణంపై చంద్రబాబు దృష్టి సారించారు. 2019 వరకు భూసేకరణ, డిజైన్లు, నిర్మాణాలు కొంత చేపట్టగా ఇప్పుడు వాటిపై పూర్తి దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే తన సొంత ఇంటిపై దృష్టి సారించారు.
Also Read: Mark Shankar Health: తన కొడుకు పరిస్థితి వివరించి భావోద్వేగానికి లోనైన పవన్ కల్యాణ్
అమరావతి పనుల్లో జోరు
అమరావతి పనులు ఇక జోరు పెంచుకుంటుండడంతో తన సొంతిల్లు నిర్మాణంపై చంద్రబాబు దృష్టిపెట్టారు. వెలగపూడిలోని సచివాలయం వెనక ఈ9 రహదారి పక్కనే చంద్రబాబు సొంతంగా భూమి కొనుగోలు చేశారు. బుధవారం ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి భూమి పూజ చేయనున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాజధాని ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోవడంతో అమరావతికి ప్రాధాన్యం లభిస్తుందని.. ప్రజల్లో కూడా రాజధానిపై పూర్తి నమ్మకం ఏర్పడుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పటికే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి భారీగా నిధులు, ప్రత్యేక కేటాయింపులు వస్తున్న విషయం తెలిసిందే. రాజధానిగా శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ మరోసారి అమరావతిలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు రానున్నారు. ఇక అమరావతిని రాజధానిగా గుర్తింపు వచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే సింగపూర్ సంస్థలతో మళ్లీ ఒప్పందాలు కుదుర్చుకుని వాటితో రాజధాని పనులు చేయించాలని నిర్ణయించింది. త్వరలోనే వాటికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









