)
AP Govt Employees Gift: ప్రభుత్వ ఉద్యోగులకు రేపు భారీ శుభవార్త రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు దీపావళి పండుగకు కానుకలు ఇవ్వగా.. ఏపీ ప్రభుత్వం కూడా ప్రకటించబోతుందని సమాచారం. ఈ క్రమంలోనే మంత్రుల బృందం సమావేశం కానుంది. దీంతో ఉద్యోగ వర్గాలు భారీ ఆశల్లో మునిగాయి. ఇప్పటికే దాదాపు నాలుగు డీఏలు ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి లేదా రెండు ప్రకటించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
తమకు రావాల్సిన కరువు భత్యం (డీఏ)తోపాటు ఇతరాత్రి వాటి కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవడంతో ఉద్యోగుల ఆగ్రహాన్ని గుర్తించిన ప్రభుత్వం రేపు కీలక సమావేశం నిర్వహించనుంది. ఏపీ సచివాలయంలో శనివారం ఉద్యోగుల సమస్యలపై మంత్రుల బృందం సమావేశం కానుంది. ఈ సమావేశానికి కొన్ని ఉద్యోగ సంఘాలను ఆహ్వానించినట్లు సమాచారం.
ఈనెల 18వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలోని ఐదో భవనంలో మంత్రుల బృందం(జీఓఎం) ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించనట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయుష్ కుమార్ తదితర అధికారులు పాల్గొనున్నారు. గుర్తింపు పొందిందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
అసంతృప్తిలో ఉద్యోగులు
తాము ఎదుర్కొంటున్న సమస్యలు మరింత పెరుగుతున్నాయని ఏపీ ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. 2024లో జరిగిన ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు కరువు భత్యం, వేతన సంఘం, ఐఆర్, పెండింగ్ బిల్లులు, పాత పింఛన్ విధానం అమలు వంటివి సమస్యలు చాలా ఉన్నాయి. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.22,000 కోట్ల బకాయిలు ఇంకా ప్రభుత్వం చెల్లించలేదని, వాటిపై ఎలాంటి ప్రకటన లేదని ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook