)
PM Kisan Annadata Sukhibhava: రైతులకు పంట పెట్టుబడి సహాయంగా అందిస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం డబ్బులు రేపు రైతుల ఖాతాలల్లో జమ కానున్నాయి. రెండో విడత నిధులు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఏపీ ప్రభుత్వం ఇచ్చే పంట పెట్టుబడి రూ.7 వేలు రైతుల ఖాతాల్లో పడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు, ఏపీ ప్రభుత్వం రూ.5 వేలు రైతులకు ఇస్తున్న విషయం తెలిసిందే.
అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద ఈ నెల 19వ తేదిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడతగా 46,85,838 రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.3,135 కోట్లు సొమ్మును ప్రభుత్వం జమ చేయనుంది. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ.2 వేలు, రాష్ట్ర వాటా రూ.5 వేలు చొప్పున మొత్తం 7 వేలు జమ కానున్నాయి. రెండు విడతల్లో కలిపి పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం రూ.6,309.44 కోట్ల నిధులను రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించనున్నాయి.
రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.2,342.92 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.792.09 కోట్లు రైతులకు చెల్లించనున్నారు. పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ కింద మొదటి విడతలో ఆగస్టు నెలలో రూ.3,174 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ 19వ తేదీన కడప జిల్లా కమలాపురంలో సీఎం చంద్రబాబు పాల్గొని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. పుట్టపర్తి పర్యటన అనంతరం మంగళవారం మధ్యాహ్నం కమలాపురం వెళ్లి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసే కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు పాల్గొనున్నారు. 10 వేల పైచిలుకు రైతు సేవా కేంద్రాల్లో నిధుల విడుదల కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేసేలా ఏర్పాట్లుచేశారు. రైతుల ఖాతాల్లో నిధుల విడుదల మాత్రమే కాకుండా.. వ్యవసాయరంగంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. అగ్రిటెక్, డిమాండ్ ఉన్న పంటల సాగు, మార్కెటింగ్ సౌకర్యం పెంపు, పకృతి సేధ్యం, భూసార పరీక్షలు, పంట ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అధిక ధర వచ్చేలా చేయడం వంటి అంశాలపై రైతులకు ప్రభుత్వం అవగాహన కల్పించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి