GFST Tourism Conclave: గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నెలకొల్పాలని.. గేమ్ చేంజర్ కావడంతోనే పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పర్యాటక రంగంలోనే ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. అందులో భాగంగా పర్యాటక శాఖ సలహాదారుగా యోగాగురూ బాబా రామ్ దేవ్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం సమక్షంలో రూ.10,329 కోట్ల విలువైన 82 ఒప్పందాలు ఏపీటీడీసీ కుదుర్చుకుంది. గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు.
Also Read: Weight Loss Journey: 140 కిలోల నుంచి 78 కిలోల బరువు తగ్గాడు.. అతడి సీక్రెట్ ఏమిటో చూద్దామా?
విజయవాడలోని మురళీ ఫార్చూన్ హోటల్‌లో శుక్రవారం జరిగిన గ్లోబల్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ (జీఎఫ్‌ఎస్టీ) టూరిజం కాన్‌క్లేవ్‌కు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. అన్ని ఇజమ్‌ల కంటే టూరిజమే మిన్న అని దశాబ్దాల కిందటే తాను చెప్పిన మాట నిజమవుతోందని పేర్కొన్నారు. భవిష్యత్ అంతా పర్యాటక రంగానిదేనని చెప్పారు. పర్యాటక రంగంతోనే పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉందని వెల్లడించారు.
Also Read: New Bride Shock: పెళ్లయిన రెండు నెలలకే ఇద్దరూ జంప్.. అత్తకు 55, అల్లుడికి 25 ఏళ్లు
'వెల్‌నెస్, హ్యాపీనెస్ ఫ్యూచర్ డెస్టినేషన్‌గా ఏపీని తీర్చిదిద్దుతాం' అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం పెట్టుబడులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దామని.. హెల్తీ, వెల్తీ, హ్యాపీ అనే నినాదంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఐటీ, ఉత్పత్తి పరిశ్రమలు, వ్యవసాయం కంటే ఎక్కువ మందికి పర్యాటక రంగం ఉద్యోగాలు కల్పిస్తుందని వివరించారు. పర్యాటక రంగం 20 శాతం వృద్ధి నమోదు చేస్తోందని.. ఏపీలో భక్తులను, పర్యాటకులను ఆకట్టుకునేలా తిరుమల, శ్రీశైలంతో పాటు మరో 10 ప్రముఖ దేవాలయాలు పర్యాటక సర్క్యూట్‌లో ఉన్నాయని వెల్లడించారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, అద్భుతమైన బీచ్‌లు, పురాతత్వ ఆనవాళ్లు కలిగిన ప్రదేశాలు, వెయ్యి కిలోమీటర్ల బీచ్ లైన్, కోనసీమ, హార్సిలీ హిల్స్ ఇలా వేర్వేరు అంశాలు ఏపీకి ఆకర్షణలు అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం అఖండ గోదావరి ప్రాజెక్టు చేపడుతున్నట్లు చెప్పారు.
Also Read: Water Filled Diesel: సీఎం కాన్వాయ్‌లో డీజిల్ బదులు నీళ్లు.. ముఖ్యమంత్రికి ఏమైందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ పర్యాటక విధానం అమలవుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. పర్యాటక ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు కార్యాచరణ చేపట్టామని.. అనుమతుల విషయంలో ఒక్క గంట కూడా వృథా కాకుండా అనుమతులు ఇస్తామని వెల్లడించారు. పర్యాటక ప్రాజెక్టులకు విద్యుత్ రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నమని.. పర్యాటక రంగంలో ఏపీ నెంబర్-1 కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దేశానికి టూరిజం మోడల్‌గా ఏపీ మారాలని పిలుపునిచ్చారు.
Also Read: Bank Holidays: రేపటి నుంచి 3 రోజులు బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?
అనుమతులు రియల్ టైమ్‌లోనే లభించేలా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో ఎలాంటి అవినీతి లేదని.. పారదర్శకత, జవాబుదారీతనం ఉందని వెల్లడించారు. ఏపీలో వచ్చే నాలుగేళ్లలో వీటిని 15 వేలకు పెరిగేలా హోటల్ గదులు చేస్తామని.. ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తామని వివరించారు.
ఏపీలో టూరిజం సర్క్యూట్లు
21 టెంపుల్ సర్క్యూట్లు
2 బుద్ధిస్ట్ సర్క్యూట్లు
25 థీమాటిక్ సర్క్యూట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









