Tirupati Tragic Accident: ఆనందంగా కుటుంబంతోపాటు విహారానికి వెళ్తున్న వారి కారు అదుపుతప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న కుటుంబ సభ్యులు విగతజీవులుగా మారారు. తిరుపతి జిల్లాలో జరిగిన ఘోర సంఘటన భయానకంగా మారింది. జాతీయ రహదారిపై రక్తం ప్రవాహంలా మారింది. కారు నుజ్జనుజ్జయి ఆ కారులో మృతదేహాలు చిధ్రంగా మారాయి. ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం పాలవడంతో ఆ కుటుంబం తీరని దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఈ ఘోర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Chandrababu Naidu: 'అమరావతి అందరిది... రాష్ట్రానికి ఆత్మవంటిది': సీఎం చంద్రబాబు
అన్నమయ్య జిల్లాలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పాకాల మండలం తోటపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా కొందరు గాయపడ్డారు. కారు మొత్తం కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఘటనా స్థలంలో క్షతగాత్రుల ఆర్తనాదాలు, రక్తతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. కాగా మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, 9 ఏళ్ల బాబు ఉన్నారు. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. మృతులు తమిళనాడుకు చెందిన వారుగా సమాచారం.
Also Read: AP Bars: మందుబాబులకు జాక్‌పాట్.. భారీగా ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఘోర సంఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సహాయ చర్యలు ప్రారంభించారు. అతి వేగంగా కంటైనర్‌ను వెనుక నుంచి వచ్చి కారు ఢీకొట్టింది. వేగానికి కారు మొత్తం నుజ్జునుజ్జు కాగా శరీరాలు కూడా గుర్తుపట్టకుండా మారాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలతో ఇద్దరు బయటపడగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. ప్రాథమికంగా అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. లేకపోతే డ్రైవర్ నిద్రమత్తు కూడా కావొచ్చని తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను అడిగి పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









