Kuppam Jallikattu Tragedy: సరదాగా.. వినోదం కోసం నిర్వహిస్తున్న జల్లికట్టు క్రీడల్లో విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన జల్లికట్టు పోటీల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జల్లికట్టు క్రీడల సమయంలో ఎద్దు ఢీకొట్టడంతో అక్కడికక్కడే యువకుడు కుప్పకూలాడు. వెంటనే గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందాడు.
Also Read: Child Politics In AP: చిన్నారిపై పార్టీల నీచపు రాజకీయం.. ఏపీలో దిగజారిన విలువలు
చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లనూరులో ఆదివారం జల్లికట్టు క్రీడోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా జల్లికట్టు పోటీలకు హాజరవడంతో గ్రామంలో కోలాహల వాతావరణం ఏర్పడింది. జల్లికట్టు క్రీడల్లో భాగంగా ఎడ్లు పరుగెత్తుతుండగా వాటిని పట్టుకునేందుకు గ్రామస్తులు, ఔత్సాహికులు పోటీపడ్డారు. వారి నుంచి తప్పించుకుంటూ ఎడ్లు దూసుకెళ్లాయి. అయితే కొద్దిసేపటికి ఓ ఎద్దు ఎదురుగా వచ్చిన యువకుడిని బలంగా ఢీకొట్డడంతో అతడు ఎగిరి కిందపడ్డాడు. కుప్పకూలిపోయిన అతడిని చూసి గ్రామస్తులు, అతడి కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడని బంధువులు చెబుతున్నారు.
Also Read: Nara Lokesh Pic Viral: క్రికెట్ మ్యాచ్‌లో నారా లోకేశ్.. ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం
మృతుడు అడవి బూదుగూరు గ్రామానికి చెందిన కరుణాకరన్. జల్లికట్టు పోటీల్లో చూసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో అనుమతి లేకుండా భారీగా జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మల్లనూరులో జరిగిన జల్లికట్టుకు కూడా అనుమతి లేదని తెలిసింది. ఈ పోటీలు నిర్వహించిన వారిపైపై చర్యలు తీసుకుంటామని కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు. కాగా మల్లనూరులో జరిగిన జల్లికట్టులో మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం.
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో విచ్చలవిడిగా జల్లికట్టు పోటీలు జరగడంతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. లక్షలాది రూపాయల భారీ ప్రైజ్ మనీతో జల్లికట్టు నిర్వహిస్తుండడంతో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి జల్లికట్టుకు భారీగా ఎద్దులు వస్తున్నాయి. అయితే అనుమతి లేకుండా సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన సంఘటనపై పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారని.. భవిష్యత్‌లో జల్లికట్టుపై కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









