Shivaratri 4 Drown in AP: మహాశివరాత్రి రోజు ఘోరం చోటు చేసుకుంది. నదుల్లో స్నానం కోసం 11 మంది యువకులు తాడిపూడిలోని గోదావరి నదిలో దిగారు. ఇందులో ఐదుగురు గల్లంతయ్యారు. వీరంతా మహా శివరాత్రి సందర్భంగా నదుల్లో స్నానానికి వచ్చారు. తూర్పుగోదావరిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. గల్లంతైన వారు పవన్, దుర్గ, ఆకాష్, సాయి, ప్రసాద్ గా గుర్తించారు. దీంతోపాటు నదిలో స్నానం చేస్తుండగా కొడుకు కొట్టుకుపోయాడు.. అతన్ని కాపాడబోయిన తండ్రి కూడా మృతి చెందారు.. నీటి ఉధృతికి ఇద్దరు మృతి చెందడంతో విషాదం చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో జరిగిన ఈ ఘటన శివరాత్రి రోజు తీవ్ర విషధాన్ని నింపింది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెంటనే చేరుకున్నారు. గజ ఈత గాళ్ళతో గాలింపు చర్యలు కూడా చేపట్టారు. తెల్లవారుజామున నది స్నానానికి ఈ యువకులు వెళ్లారు. అయితే వీళ్ళు లోతు ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతోనే ఈ ఘోరం చోటు చేసుకుంది. నీళ్లలోకి జారీ పోగా ఒకరిని ఒకరు రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఇలా ఐదుగురు యువకులు నీట మునిగారు. ప్రధానంగా ఈ యువకులంతా ఇసుక తెన్నులపై నడుచుకుంటూ వెళ్తూ లోతు ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతోనే మునిగిపోయారు. అంతేకాదు ఈ ఘోరం చేసుకున్న ప్రదేశంలో స్నానాల రేవు కూడా లేదు.
గల్లంతయిన యువకులంతా తాడిపూడి గ్రామానికి చెందిన వారిగానే పోలీసులు గుర్తించారు. ఇందులో పడాల దుర్గాప్రసాద్ (19) ఆనిశెట్టి పవన్ (19), తిరుమల శెట్టి పవన్ (17), ఆకాష్ (19) పడాల సాయి (19) గా పోలీసులు గుర్తించారు. మహాశివరాత్రి సందర్భంగా గోదావరి నదిలో ఉదయం స్నానాని కోసం ఈ యువకులు వచ్చారు. వీరంతా తాడిపూడి గ్రామానికి చెందిన వారు డిగ్రీ, డిప్లమా చదువుతున్న యువకులు. అయితే వీరిలో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి యువకుడి మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న వెంటనే కొవ్వూరు ఆర్డీవో రాణి సుష్మిత , ఎస్పీ నరసింహ కిషోర్ కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టారు. మరో నలుగురి యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్డిఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. అంతేకాదు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు, స్థానికులు ఈ ఘటన స్థలానికి చేరుకుంటున్నారు. అయితే కొవ్వూరు ఆర్డీవో రాణి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు.
గతంలో ఇలా గోదావరి నదీ స్నానానికి వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థలంలో ఉన్న అధికారులు లోతుకు మించి ముందుకు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనతో శివరాత్రి రోజు తాడిపూడి గ్రామంలో తీవ్ర విషాధం నెలకొల్పింది.
ఇదీ చదవండి: తిరుమల వెళ్లే భక్తులకు అలెర్ట్.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం..
ఇదీ చదవండి: క్రికెట్ లవర్స్‌కు జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో హాట్‌స్టార్ కూడా ఉచితం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









