)
Train Went Return For One Km For Save Passanger: ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తూ రైలు బోగి నుండి కింద పడిపోయాడు. దీంతో అతని ప్రాణాన్ని కాపాడేందుకు రైలు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ వెనక్కి వెళ్లింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని బ్రాహ్మణ, కోడూరు గ్రామాలకు చెందిన కమలకంటి హరిబాబు, మావోబాబు, వెంకటేశ్వర్లు, విమలరాజు భవన నిర్మాణ కార్మికులు.. పనికోసం యలహంకకు బయల్దేరారు. ఇందుకోసం గుంటూరులో కొండవీడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ని ఎక్కారు.
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఒక దుర్ఘటన జరిగింది. గుంటూరు నుంచి యలహంక వెళ్తున్న కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలులో హరిబాబు అనే 35 ఏళ్ల వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. అతను భోజనం చేసి చేతులు కడుక్కోవడానికి రైలు గేటు దగ్గర నిల్చున్నప్పుడు రైలు భారీ కుదుపునకు గురవ్వడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు.
దీన్ని చూసిన అతని స్నేహితులు వెంటనే రైలు చైన్ లాగారు. రైల్వే అధికారుల అనుమతితో రైలును సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు వెనక్కి నడిపించారు. పట్టాల పక్కన పడి ఉన్న హరిబాబును స్నేహితులు, రైల్వే సిబ్బంది కలిసి రైలులోకి ఎక్కించి మార్కాపురం రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ నుంచి 108 అంబులెన్స్‌లో అతన్ని మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే.. రైల్వే అధికారులు అంత కష్టపడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో హరిబాబు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook