TTD Board: టీటీడీ పాలక మండలి సమావేశం.. శ్రీవారి భక్తుల కోసం పలు కీలక నిర్ణయాలు..

మరి కాసేపట్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం కానుంది.  టీటీడి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది ఈ బేటీలో సుమారుగా రూ. 5400 కోట్లఅంచనాలతో 2025 - 26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.గత ఏడాది వార్షిక బడ్జెట్ రూ. 5141 కోట్లుగా ఉంది.  అయితే ఈ సమావేశంలో 30 కు పైగా అజెండా అంశాలపై చర్చించితీర్మానాలు చేయనున్నారని సమాచారం. సీఎంచంద్రబాబు తిరుమలకు వచ్చిన సందర్భంగా శంలోని అన్ని రాష్ట్రాలలో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని ప్రకటన చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 24, 2025, 10:06 AM IST
TTD Board: టీటీడీ పాలక మండలి సమావేశం.. శ్రీవారి భక్తుల కోసం పలు కీలక నిర్ణయాలు..

TTD Board: మరి కాసేపట్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం కానుంది.  టీటీడి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది ఈ బేటీలో సుమారుగా రూ. 5400 కోట్లఅంచనాలతో 2025 - 26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.గత ఏడాది వార్షిక బడ్జెట్ రూ. 5141 కోట్లుగా ఉంది.  అయితే ఈ సమావేశంలో 30 కు పైగా అజెండా అంశాలపై చర్చించితీర్మానాలు చేయనున్నారని సమాచారం. సీఎంచంద్రబాబు తిరుమలకు వచ్చిన సందర్భంగా శంలోని అన్ని రాష్ట్రాలలో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని ప్రకటన చేశారు.

Add Zee News as a Preferred Source

ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తామన్నారు.  ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది.
అంతేకాదు శ్రీవారి కైంకర్యాలకు ముడి సరుకులు కొనుగోలు కోసం నిధులు విడుదల చేయనున్నారు.దీనికి తోడు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న టిటిడి డిపాజిట్లను వెనక్కు తీసుకొనిజాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనే నిర్ణయంపై నిపుణుల కమిటీ సిఫారసులపై కూడాచర్చించనున్నారు.  వేసవి నేపథ్యంలో  కొండపై నీటి కొరత లేకుండా చర్యలకు ప్రణాళికల రచనపై చర్చించనున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజా నిధులు ఇచ్చే సిఫార్సు లేఖలపై ఈ భేటిలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.  

దీనికి తోడు వేసవి సెలవులు రద్దిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పనపై చర్చించనున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా వాళ్ల కు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నారు. మరోవైపు కొండ కింద భక్తులకు ఇచ్చే ఉచిత టోకెన్స్ ను మరో 5 వేలకు పైగా పెంచడానికి ఈ పాలక మండలి భేటిలో నిర్ణయం తీసుకోనున్నారు.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News