)
Ttd chairman br naidu reacts on lv Subrahmanyam comments: తిరుమలలో ఇటీవల భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. టోకెన్లు ఉన్న భక్తులకు కొన్ని సార్లు 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఇక టొకెన్లు లేని భక్తులకు కొన్ని సార్లు 10గంటలు, మరికొన్ని సార్లు 15 గంటల పాటు కంపార్ట్ మెంట్ లోనే వేచి ఉండాల్సిన సిట్యూవేషన్ లు ఉంటున్నాయి.ఈ క్రమంలో టీటీడీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఏఐ టెక్నాలజీని ఉపయోంచుకుని సామాన్య భక్తులు గంటల కొద్ది కంపార్ట్ మెంట్ లో వేచి ఉండకుండా.. భక్తులకు దర్శించుకునే విధంగా గూగుల్ , టీసీఎస్ లతో అనుసంధానం చేసుకుని ఏఐ టెక్నాలజీని దర్శనాలలో తీసుకొని వచ్చే దిశగా ముందుకు వెళ్తుంది.
ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్శించుకుని చేసిన కామెంట్స్ ఒక్కసారిగా వివాదంగా మారాయి. తిరుమలలో భక్తులకు మూడు గంటల్లో దర్శనాలు కల్పించడం అసాధ్యమన్నారు. తిరుమల ఆలయంలో కొన్ని పరిమితులున్నాయన్నారు. ఏఐని స్వామి వారి విషయంలో ముందుకు వెళ్లడం అంత సబబు కాదన్నారు. దీనికి బదులుగా భక్తులకు ఇతర వసతులు కల్పించడంపై టీటీడీ చర్యలు తీసుకొవాలన్నారు. దీనిపై తాజాగా.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రియాక్ట్ అయ్యారు.
టీటీడీకి గతంలో ఈఓగా పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఐ టెక్నాలజీపై సరైన అవగాహన లేకుండా ఇలా మాట్లాడటం విచారకరం అన్నారు.
సామాన్య భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్సులో గంటల తరబడి ఉండకుండా.. కేవలం రెండు గంటల్లో శ్రీవారి దర్శనం అయ్యేలా ఒకమంచి ఆలోచనతో ఉండగా ఈ వ్యాఖ్యలు చేయడం బాధకరం అన్నారు. దాతల సహాయంతో చేస్తున్న ఈ బృహత్కార్యాన్ని వృధా అంటూ విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని బీఆర్ నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం భక్తులను గంటలు, ఒక్కోసారి రోజుల తరబడి కంపార్ట్మెంట్లలో, షెడ్లలో ఉంచి ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతేనా అని బీఆర్ నాయుడు ఎల్వీ సుబ్రహ్మణ్యంకు కౌంటర్ వేశారు. భక్తుల కష్టాలను దూరం చేయాలన్న సదుద్దేశంతోనే ఏఐ టెక్నాలజీని తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు.
ప్రపంచమంతా టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నప్పుడు, టీటీడీ కూడా దాన్ని తీసుకొని రావాలని అనుకొవడంలో తప్పులేదన్నారు. భక్తులకు లేని అపోహాలు కల్గజేసేలా మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు ఎంత మాత్రం కరెక్ట్ కాదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రస్థాయిలో ఖండించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.