)
Ttd Ex chairman bhumana karunakar reddy controversy: తిరుమల అలిపిరి మార్గంలో ఉన్న శ్రీమహా విష్ణువు విగ్రహంను టీటీడీ అస్సలు పట్టించుకొకుండా వదిలేసిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా అపరి శుభ్రవాతావరణంలో, మద్యం బాటిళ్ల మధ్య స్వామివారి విగ్రహంను ఉండటం పెద్ద వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై ఏపీలో పొలిటికల్ గా హీటెక్కింది. దీనిపై టీటీడీతో పాటు, ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా క్లారిటీ ఇచ్చారు.
అది శనీశ్వరుడి విగ్రహం అంటూ కూడా చెప్పారు. శనీశ్వరుడికి ఎక్కడైన శంఖు, చక్రాలు ఉంటాయా..?.. అంటూ ప్రశ్నలు గుప్పించారు. మరోవైపు టీటీడీ డిప్యూటీ ఈవో గోవింద రాజు ఫిర్యాదుమేరకు అలిపిరి పోలీసులు కేసును నమోదు చేశారు. దీనిపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుమలలో తప్పిదాలు జరిగినంత కాలం తాను ప్రశ్నిస్తునే ఉంటానన్నారు. శనీశ్వరుడ్ని ఒక దెయ్యంలా ఏపీ ప్రభుత్వం ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. అలిపిరి వద్ద విగ్రహం నెగ్లిజెన్సీగా పడేశారని చెబితే.. తనపై కేసులు పెడతారా అంటూ ఫైర్ అయ్యారు. టీటీడీ పాలక మండలి తప్పిదాలు చేస్తున్నంత కాలం ఎందాకైన ప్రశ్నిస్తానని, పోరాటం చేస్తానని కూడా భూమన స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఇప్పటికే.. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు తమ ఎదుట హజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో భూమన అలిపిరి పీఎస్ లో విచారణకు హజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook