Tirumala News: గోశాల వివాదం వేళ షాకింగ్ ఘటన.. టీటీడీ బంగ్లాలో భారీ సర్పం.. ఆయనకు కాటు..!

Ttd Goshala controversy: తిరుమలలో ఇటీవల గోశాలలో అనేక ఆవులు మరణించాయని కూటమి ప్రభుత్వంను వైసీపీ తీవ్రంగా ఎండగడుతుంది. ఈ క్రమంలో టీటీడీ ఈవో శ్యామల రావు ఇంట్లో భారీ సర్పం ప్రవేశించింది. ఈ  ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 18, 2025, 12:30 PM IST
  • టీటీడీ ఈవో బంగ్లాలో పాము..
  • ఆందోళన చెందుతున్న భక్తులు..
Tirumala News: గోశాల వివాదం వేళ షాకింగ్ ఘటన.. టీటీడీ బంగ్లాలో భారీ సర్పం.. ఆయనకు కాటు..!

Cobra Snake enters ttd eo shyamala rao bungalow: తిరుమలలో గోశాల వివాదం ప్రస్తుతం రచ్చగా మారింది. ఈ  ఘటనలో ఇప్పటికే కూటమి వర్సెస్ వైసీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏకంగా గతంలో టీటీడీకి చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి దీనిపై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే వైసీపీ నేతలు, మాజీ మంత్రులు కూటమికి వ్యతిరేకంగా తిరుమలలో ఆందోళనలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తిరుమలలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Add Zee News as a Preferred Source

టీటీడీ ఈవో శ్యామల రావు ఉంటున్న బంగ్లాలో ఒకభారీ సర్పం ప్రవేశించింది. ఈ క్రమంలో వెంటనే దాన్ని గుర్తించిన అక్కడున్న సిబ్బంది పాములను పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. ఇంతలో టీటీడీకి చెందిన  రిటైర్డ్ ఉద్యోగి రవీంద్ నాయుడు పామును పట్టుకునే ప్రయత్నంచేశాడు. అది కాస్త సంచిలోకి వేస్తుండగా ఒక్కసారిగా ఆయన చేతిపై కాటు వేసింది.

ఈ క్రమంలో వెంటనే రవీందర్ నాయుడును స్విమ్స్ కు తరలించారు. ప్రస్తుతం రవీందర్ హెల్త్ నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అదే విధంగా ఒక వైపు తిరుమలలో గోశాల వివాదం, ఇటీవల మాజీ మంత్రి రోజా సైతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పై శ్రీవారి జోలికి వస్తే ఎలా ఉంటుందో ఇద్దరికి తెలిసొచ్చిందని కామెంట్లు చేశారు.

Read more: Rk Roja On Pawan Kalyan: నీ కొడుక్కి అందుకే అలా జరిగింది..!.. పవన్‌పై రోజా షాకింగ్ కామెంట్స్... ఏపీ రాజకీయాల్లో దుమారం..

ఈ నేపథ్యంలో ఇప్పుడు టీటీడీ ఈవో ఇంట్లో భారీ సర్పం ప్రవేశించడం పట్ల భక్తులు మాత్రం తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో దయచేసి ఎలాంటి అపచారాలు జరక్కుండా చూసుకొవాలని అధికారుల్ని కోరుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News