Tirumala: తిరుమల భక్తులకు బిగ్ షాక్.. డిసెంబర్, జనవరి మాసాల్లో ఆ దర్శనాలు పూర్తిగా రద్దు..

Ttd key announcement on vip break darshan: తిరుమలలో ప్రస్తుతం డిసెంబర్,  కొత్తఏడాది జనవరి మాసంలో ప్రత్యేకమైన పండగల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. దీనిపై భక్తులకు పలుసూచనలు చేసింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 10, 2025, 06:51 PM IST
  • వీఐపీ భక్తులకు టీటీడీ బిగ్ ట్విస్ట్..
  • ప్రత్యేక పర్వదినాల నేపథ్యంలో దర్శనాలు రద్దు..
Tirumala: తిరుమల భక్తులకు బిగ్ షాక్.. డిసెంబర్, జనవరి మాసాల్లో  ఆ దర్శనాలు పూర్తిగా రద్దు..

Ttd key announcement on Tirumala vip break darshan: తిరుమలలో ప్రస్తుతం డిసెంబర్, న్యూఇయర్ జనవరి మాసంలో ప్రత్యేకమైన పండగల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.ద దీనిపై కీలక ప్రకటన చేసింది. తిరుమలలో ప్రస్తుతం భక్తులు రద్దీ భారీగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో టోకెన్లను జారీ చేసింది. డిసెంబర్ 30నుంచి జన్వరి 1 వరకు టోకెన్లను జారీ చేసింది. ఆ తర్వాత జనవరి 2 నుంచి 8వతేదీ వరకు రూ. 300 టికెన్లు 15 వేల, శ్రీవాణికి సంబంధించి 1000 టోకెన్లును జారీ చేసింది. ఇదిలా ఉండగా తిరుమలలో జనవరి 2 నుంచి 8 వరకు ప్రతిరోజు కూడా సర్వదర్శనం క్యూలైన్ లలో భక్తులను టీటీడీ అనుమతించనుంది.

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనంనేపథ్యంలో టీటీడీ సామాన్య భక్తులకు ప్రయారిటీగా దర్శన భాగ్యం కల్పించేందుకు అన్నిరకాలు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో టీటీడీ తిరుమల వీఐపీ భక్తులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ముఖ్యంగా డిసెంబర్, జనవరి మాసాల్లో స్వామి వారి పండగల నేపథ్యంలో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ముఖ్యంగా..డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది జనవరి నెల వరకు వివిధ పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి.  డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ 29వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. 

Read more: Tirumala: తిరుమలలో బ్లడ్ డొనేట్ చేసి శ్రీవారి దర్శనం ప్లాన్ చేస్తున్నారా..?.. టీటీడీ ఈ కొత్త రూల్ మీకు తెలుసా..?

అదే విధంగా.. డిసెంబర్ 30వ తేది నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, జనవరి 25న రథ సప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. అయితే.. పైన పేర్కొన్న రోజులకు ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు సహాకరించాలని టీటీడీ కీలక విజ్ఞప్తి చేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News