Tirumala News: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇక మీదట తిరుమలలో ఇవి నిషేధం.!. టీటీడీ కీలక ఆదేశాలు..

Ttd key orders on chinese food: తిరుమలలో భక్తులకు ఆహార పదార్థాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా చర్యలు తీసుకొవాలని టీటీడీ తినుబండారాల దుకాణదారుల్ని ఆదేశించింది. భక్తులకు క్వాలిటీతో కూడిన సంప్రదాయమైన వంటకాల్ని అందించాలని స్పష్టం చేసింది.  

Written by - Inamdar Paresh | Last Updated : May 9, 2025, 04:56 PM IST
  • తిరుమలలో చైనీస్ ఫుడ్ నిషేదం..
  • చర్యలు చేపట్టిన సిబ్బంది..
Tirumala News: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇక మీదట తిరుమలలో ఇవి నిషేధం.!. టీటీడీ కీలక ఆదేశాలు..

Chinese all type food staff banned in Tirumala: తిరుమల శ్రీవారిని చాలా మంది భక్తులు ఎంతో విశ్వసిస్తుంటారు. కలియుగ దైవం అయిన స్వామిని దర్శించుకొవడం కోసం ఎంత దూరంనుంచి అయిన.. ఎన్ని గంటలపైన వేచి చూస్తారు. కళ్లరా స్వామిని దండం పెట్టుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే.. తిరుమలలో ఇటీవల  చాలా మంది భక్తులు తిరుమల  ఆలయం చుట్టుపక్కల తినబండారాలు, ఆహార పదార్థాలు క్వాలిటీగా ఉండటంలేదని టీటీడీ కి ఫిర్యాదులు చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

ఈ నేపథ్యంలో  టీటీడీ దీనిపై చర్యలకు దిగింది. తిరుమలలోని హోటళ్ల యజమానులతో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమావేశం అయ్యారు. తిరుమలలో ఉన్న  షాపుల ఓనర్ లతో మాట్లాడుతూ.. తిరుమలకు వచ్చే భక్తులకు మంచి ఫుడ్ అందించేలా చూడాలన్నారు. అదే విధంగా శుచీగా,మంచి క్వాలిటీతో కూడిన ఆహారం అందించాలన్నారు.

ఇతర రాష్ట్రాలనుంచివచ్చే భక్తులకు వారికి నచ్చిన విధంగా వెరైటీఫుడ్ అందించాలన్నారు. అదే క్రమంలో చైనీస్ ఫుడ్ ను తిరుమలలో శాశ్వతంగా బ్యాన్ చేస్తున్నట్లు తెలిపారు.  

ఇక మీదట చైనీస్ రైస్, నూడుల్స్, మంచురియా మొదలైన పదార్థాలు తిరుమలలో విక్రయానికి అనుమతిలేదన్నారు. ఈ క్రమంలో భక్తులు హెల్త్ విషయంలో నెగ్లీజెన్సీగా ఉండొద్దన్నారు.

క్రమం తప్పుండా. శుభ్రతను పాటించాలన్నారు. అదేవిధంగా హోటళ్ల నిర్వహాణలో, పనిచేసే సిబ్బంది సైతం సాంప్రదాయాల్ని పాటించాలన్నారు.  హోటల్లో వద్ద ట్రేడ్ లైసెన్స్, జిఎస్టి వంటి ధ్రువీకరణ పత్రాలను అధికారులకు కనిపించేలా ఫోటో ఫ్రెమ్ చేసి పెట్టాలన్నారు.

Read more: Plane Flies Over Tirumala Video: ఉగ్రదాడులతో టెన్షన్ టెన్షన్.. శ్రీవారి ఆలయం మీద విమానం చక్కర్లు.. వీడియో వైరల్..

అదేవిధంగా.. భక్తులు డిజిటల్ పేమెంట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. హోటల్ నిర్వహణ లైసెన్సును నిర్ణీత సమయంలో రెన్యువల్ చేసుకోవాలన్నారు. అన్ని దుకాణాలలో ధరల పట్టికను ప్రదర్శించాలని ఆదేశించారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News