
Tirumala Laddu Prasadam Injury: తిరుమల తిరుపతి దేవస్థానంపై దురుద్దేశపూర్వకంగా.. లేదంటే వాస్తవం చెబుతున్నారో కానీ తరచూ ఏదో వివాదం చుట్టుముడుతోంది. తిరుమల సేవల విషయంతోపాటు అక్కడి సౌకర్యాలు.. భద్రతా చర్యలు వంటి వాటిపై నిత్యం వివాదం చెలరేగుతోంది. తాజాగా మరోసారి తిరుమల లడ్డూ ప్రసాదంపై దారుణ ప్రచారం జరుగుతోంది. తిరుమల ప్రసాదం తినడం ద్వారా నోటికి తీవ్ర గాయమైందని సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన సంచలనంగా మారింది. అయితే ఈ ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఏం జరిగింది?
జూన్ 8వ తేదీన తిరుమలను తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే భక్తుడు సందర్శించాడు. ఆ సమయంలో తిరుమల లడ్డూ ప్రసాదం తిన్నాడు. అయితే లడ్డూ తిన్న వెంటనే తనకు గాయమైందని నవీన్ కుమార్ ఆరోపించాడు. దానికి సంబంధించిన ఫొటోలు తీసుకుని 'ఎక్స్' వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడు చేసిన ఆరోపణలు.. ఫొటో వైరల్‌గా మారింది. ఈ వార్త తమ దృష్టికి రావడంతో టీటీడీ స్పందించింది.
టీటీడీ ఖండన
తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న దుష్ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) స్పందించింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్ చేస్తున్న ఆరోపణలను టీటీడీ తీవ్రంగా ఖండించింది. అతడు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది.
FAKE NEWS ALERT: A man falsely claimed TTD Laddu caused injury.
•He bit his tongue while eating
•Doctors confirmed Laddu was safe
•He demanded money, then threatened to post onlineLegal action is being taken for spreading false news.#TTD #FakeNews #OmNamoVenkatesaya pic.twitter.com/MM4GYAi2ip
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) June 13, 2025
వాస్తవం ఇది
‘జూన్ 8న తిరుమల లడ్డూ ప్రసాదం తినేటప్పుడు నోటిలో గాయమైందని ఆ వ్యక్తి ఆరోపించాడు. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది బాధితుడిని అంబులెన్స్‌లో తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్స అందించారు. అనంతరం స్విమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించారు. బాధితుడు ప్రసాదం తింటూ తన నాలుకను తానే కొరుక్కోవడంతో నోట్లో చిన్న గాయమైంది. ఇదే విషయం వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది' అని టీటీడీ వివరణ ఇచ్చింది.
అసత్య ఆరోపణలు
వాస్తవం ఇది జరిగితే భక్తుడు నవీన్ కుమార్ మాత్రం తితిదే నుంచి నష్టపరిహారం పొందాలనే దురుద్దేశంతో లడ్డూ ప్రసాదంపై సోషల్‌మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నట్టు గుర్తించినట్లు టీటీడీ ప్రకటించింది. అతడి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. భక్తులను గందరగోళానికి గురిచేసేలా దురుద్దేశపూరిత చర్యకు పాల్పడిన నవీన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తితిదే వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook