TTD Temples: ముఖ్యమంత్రులకు టీటీడీ లేఖలు.. ప్రతి రాజధానిలో శ్రీవారి ఆలయం

TTD Wrotes Letters To 14 Chief Ministers For Srivari Temple: తిరుమల శ్రీవారి ఆలయాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులతోపాటు ప్రధాన నగరాల్లో నిర్మించాలని టీటీడీ సంకల్పించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 5, 2025, 07:12 PM IST
TTD Temples: ముఖ్యమంత్రులకు టీటీడీ లేఖలు.. ప్రతి రాజధానిలో శ్రీవారి ఆలయం

TTD Temples In Every States: దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం తన సేవలను విస్తరించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి రాజధానిలో శ్రీవారి ఆలయం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ విషయమై దేశంలోని 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు టీటీడీ లేఖలు రాసింది. రాజధాని ప్రాంతాల్లో ఆలయ నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని ఈ మేరకు టీటీడీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది.

Add Zee News as a Preferred Source

Also Read: Samantha: 'మాజీ భర్త నాగ చైతన్యతో చేసిన ప్రతి సీన్‌ నాకు గుర్తుంది': హీరోయిన్ సమంత

అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని మొత్తం 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలకు టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు లేఖలు రాశారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదని.. దేవాలయాలు  సమాజ అభివృద్ధికి దోహదపడతాయని లేఖలో పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని గుర్తుచేశారు. ఆధ్యాత్మిక వైపు అందరూ అడుగులు వేస్తున్నారని.. ప్రతి రాష్ట్ర రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయం ఉండాలని చెప్పారు. 

Also Read: APPSC Age Limit: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. ఏపీపీఎస్సీ వయో పరిమితి పెంపు

'దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలు ఉండాలి. కోట్ల మంది భక్తులు దేవాలయాలకు విరాళాలు ఇస్తున్నారు. వాటిని విద్య, వైద్యం సహా ఇతర సేవ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నాం. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి’ అని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు లేఖలో పేర్కొన్నారు. రాజధానులలో 5 నుంచి 10 ఎకరాల భూమిని కేటాయించాలని అభ్యర్థించారు.

తిరుమల, తిరుపతిలో ఉన్న దేవాలయాలనే కాకుండా సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ రాష్ట్ర రాజధానులు / భారతదేశంలోని ప్రముఖ నగరాలైన న్యూఢిల్లీ, జమ్మూ, చెన్నై, హైదరాబాద్, భువనేశ్వర్, కన్యాకుమారి, కురుక్షేత్ర, విశాఖపట్నం మొదలైన వాటిలో కూడా దేవాలయాలను నిర్మించింది' అని చైర్మన్‌ లేఖలో గుర్తుచేశారు. నవీ ముంబైలో నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. మీరు కూడా సహకరించాలని ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంత అధికారులకు టీటీడీ లేఖలు పంపించింది.

టీటీడీ లేఖలు పంపిన ముఖ్యమంత్రులు వీరే
ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం, గోవా, జార్ఖండ్, గుజరాత్, కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, త్రిపుర

కేంద్రపాలిత ప్రాంతాలు
దాద్రా అండ్‌ నాగర్ హవేలి, చండీగఢ్, డామన్ అండ్‌ దిర్, లక్షద్వీప్, అండమాన్ అండ్‌ నికోబార్ ద్వీపం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News