Tirumala Video: మరోసారి వివాదంలో తిరుమల.. కళ్యాణ కట్ట దగ్గర మహిళా ఉద్యోగి ఏంచేస్తుందో తెలుసా..? .. వీడియో వైరల్..

Tirumala Kalyana Katta video:  తిరుమల కళ్యాణ కట్ట దగ్గర తలనీలాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల నుంచి అక్కడున్న టీటీడీ మహిళా ఉద్యోగులు డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీంతో మరోసారి భక్తులు టీటీడీపై మండపడుతున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 22, 2025, 02:35 PM IST
  • తిరుమలలో డబ్బులు డిమాండ్ చేస్తున్న మహిళ..
  • ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న భక్తులు..
Tirumala Video: మరోసారి వివాదంలో తిరుమల.. కళ్యాణ కట్ట దగ్గర మహిళా ఉద్యోగి ఏంచేస్తుందో తెలుసా..? .. వీడియో వైరల్..

Ttd woman employee demanding money at Tirumala kalyana katta Video: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా స్వామివారి దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చూసుకొవలని చంద్రబాబు సర్కారు టీటీడీని ఆదేశించింది. అదే విధంగా ఇటీవల తిరుమల లడ్డువివాదం బైటపడినప్పటి నుంచి మరోసారి తిరుమలలో ఎలాంటి తప్పిదాలు జరిగిన వదిలిపెట్టమని కూటమిప్రభుత్వం టీటీడీకి గట్టిగానే చెప్పింది.

Add Zee News as a Preferred Source

కానీ తిరుమల మాత్రం తరచుగా ఏదో అంశంతో వార్తలలో ఉంటుంది. ముఖ్యంగా తిరుమలలో కొంత మంది రీల్స్ చేస్తున్నారు. మరికొందరు రాజకీయనేతలు కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు. అన్యమత ప్రచారం, నాన్ వెజ్ లు దొరికిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల తిరుమలలో గోవుల వివాదం వైసీపీ వర్సెస్ కూటమిగా మారింది. టీటీడీ అన్ని అసత్యాలు చెప్తుందని వైసీపీ ఆరోపణలు గుప్పిస్తుంది.

 

అదే విధంగా తిరుమలలో ఎన్ని చర్యలు తీసుకున్న కొంత మంది టీటీడీ ఉద్యోగులు .. శ్రీవారికి కల్పించే సేవల టికెట్ లను రహస్యంగా అమ్ముకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.మరికొందరు డబ్బులు ఇస్తే.. ఏదైన చేస్తున్నారని చాలా మంది అంటున్నారు . మరికొందరు తిరుమలలో దుకాణాదారులు, టీటీడీకి చెందిన కొంత మంది ఉద్యోగులు అడ్డాంగా దోచుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటికే తిరుమలలో కళ్యాణ కట్టలో కొంత మంది తలనీలాలు తీసేచోట డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా.. ఒక టీటీడీ మహిళ ఉద్యోగి తలనీలాలు తీసేందుకు.. ఒక గుండుకు వంద రూపాయలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసింది. కళ్యాణ కట్టకు వచ్చిన భక్తుల నుంచి గుండుకు వందరూపాయల్ని వసూలు చేసింది.

Read more: Tirumala: తిరుమలలో వేసవి రద్దీ వేళ.. వీఐపీ సిఫార్సు లేఖల తిరస్కరణ?

అక్కడున్న కొంత మంది ఈ  ఘటనను వీడియో తీసి  సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ అంశం కాస్త వార్తలలో నిలిచింది. దీంతో తిరుమల అంశం మారోసారి వార్తలలో నిలిచింది. ఈ క్రమంలో భక్తులు టీటీడీపై మండిపడుతున్నారు. ఇప్పటికే తిరుమలలో కొంత మంది చెప్పులు ధరించి.. ఏకంగా స్వామి వారి ప్రధాన ఆలయం వరకు వచ్చిన ఘటన దుమారంగా మారిన విషయం తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News