Panchanga Sravanam on Ys Jagan: భయమెరుగని వైఎస్ జగన్, విజయం ఖాయం అంటున్న పంచాంగం

Panchanga Sravanam on Ys Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు భయం అనేది తెలియదా..రానున్న రోజుల్లో విజయ దుందుభి మోగించడం ఖాయమా..ఉగాది పంచాంగం అదే చెబుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 30, 2025, 07:51 PM IST
Panchanga Sravanam on Ys Jagan: భయమెరుగని వైఎస్ జగన్, విజయం ఖాయం అంటున్న పంచాంగం

Panchanga Sravanam on Ys Jagan: తెలుగు ప్రజల కొత్త సంవత్సరం ఉగాది అందరూ ఆనందంతో జరుపుకుంటున్నారు. ఉగాది రోజున తప్పకుండా కన్పించే పంచాంగ శ్రవణం జరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ పార్టీ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం చర్చనీయాంశంగా మారింది. 

Add Zee News as a Preferred Source

శ్రీ విశ్వావసు నామ సంవత్సర వేడుకలు ఏపీలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ పంచాంగ కర్త అవధాని నారాయణ ముర్తి పంచాంగ పఠనం విన్పించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిధున రాశిలో పుట్టిన జగన్‌కు భయం అనేది తెలియదని, గత ఎన్నికల్లో ఓడిపోయినా ఎక్కడా భయపడలేదని వివరించారు. ఆయన వైఎస్ జగన్‌ను ఏకంగా విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీ కృష్ణదేవరాయలతో పోల్చారు. శ్రీ కృష్ణదేవరాయల మాదిరిగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు. 

2019 ఎన్నికల్లో సృష్టించినట్టే మరోసారి వైఎస్ జగన్ ఘన విజయం సాధిస్తారన్నారు. ప్రజలు ఆవేశంతో చేసిన తప్పులకు ఇప్పుడు చింతిస్తున్నారని అవధాని తెలిపారు. ఈ ఏడాది మిధున రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పారు. సాధారణంగా చాలామంది ఓడినప్పుడు భయపడతారని చెప్పారు. కానీ జగన్ అలా భయపడలేదని గుర్తు అవధాని నారాయణ మూర్తి గుర్తు చేశారు.వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొంటారని తెలిపారు. 

అయితే ఈ కార్యక్రమం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలోనే జరిగినా వైఎస్ జగన్ లేదా ఆయన సతీమణి వైఎస్ భారతి పాల్గొనలేదు. పార్టీ పెద్దలు కూడా దూరంగా ఉన్నారు. 

Also read: Ugadi 2025: ఈ ఏడాది ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News