TDP Panchangam: తెలుగు నూతన సంవత్సరం ఉగాది పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహించింది. ఈ సందర్బంగా ప్రముఖ పంచాంగ కర్త మాడుగుల నాగఫణి శర్మ భవిష్యవాణి విన్పించారు. ఏపీ రాజధాని అమరావతికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు తిరుగుండదని చెప్పారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా ఇవాళ విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన ఉగాది ఆస్థానంలో ప్రముఖ పంచాంగకర్త మాడుగుల నాగఫణి శర్మ పంచాంగం విన్పించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ముప్పు వాటిల్లదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరో రెండు సార్లు కచ్చితంగా ఉంటారన్నారు. అర్హత ఉన్నవారికి దశలవారీగా పదవులు దక్కుతాయన్నారు. అమరావతిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు అమరావతి నిర్మాణం ఆగుతూ..సాగుతూ కదిలినా ఇకపై ఎలాంటి ఢోకా ఉండదన్నారు. అమరావతి నిర్మాణం ఇకపై నిర్విరామంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశిస్తున్నట్టుగా అమరావతి త్వరలోనే విశ్వనగరం అవుతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు అయితే మరో పది పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. పదవులు రాలేదని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. అర్హత ఉన్నవారికి ఆలస్యమైనా సరే పదవులు దక్కుతాయన్నారు. తెలుగుదేశం నేతలు, కూటమి పార్టీల విషయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పంచాంగ శ్రవణంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నేతలకు పదవుల విషయంలో పంచాంగకర్త నోటి నుంచి వ్యాఖ్యలు రావడంపై ఆరోపణలు విన్పిస్తున్నాయి.
Also read: Panchanga Sravanam on Ys Jagan: భయమెరుగని వైఎస్ జగన్, విజయం ఖాయం అంటున్న పంచాంగం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









