)
Anantapur Govt Hospital: అనంతపురం సర్వజన వైద్యశాలలో ఓ జూనియర్ డాక్టర్‌పై అత్యాచార యత్నం ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజులుగా ఆమెను అనుసరించిన ఆగంతకుడు విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్ చెయ్యి పట్టుకొని గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. భయాందోళనకు గురయిన జూనియర్ డాక్టర్ పెద్ద ఎత్తున కేకలు వేయడంతో అక్కడి నుంచి దుండగుడు పరారయ్యాడు. ఈ ఘటనపై అవుట్ పోస్ట్ పోలీసులు కానీ ఆసుపత్రి ఉన్నతాధికారులు గాని పట్టించుకోకపోవడంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
నిత్యం రోగులతో రద్దీగా ఉండే అనంతపురం నగరంలోని మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థి హౌస్ సర్జన్ చదువుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తోంది. వారం రోజుల కిందట అనంతపురం పట్టణానికి చెందిన మోహన్ సాయి అనే యువకుడు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అతడికి సదరు వైద్య విద్యార్థి వైద్యం చేశారు. వైద్యం అందిస్తున్న సమయంలోనే జూనియర్ డాక్టర్‌పై అతడు కన్నేశాడు. వారం రోజులపాటు జూనియర్ డాక్టర్ కదలికలపై నిఘా వేశాడు.
ఈ క్రమంలోనే మూడు రోజుల కిందట రాత్రి సమయంలో మోహన్ సాయి ఆస్పత్రిలోకి ప్రవేశించాడు. జూనియర్ వైద్యురాలిని ఓ గదిలోకి లాక్కువెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ఆమె భయంతో గట్టిగా కేకలు వేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులు అడ్డుకున్నారు. మోహన్ సాయిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని అతడు పారిపోయాడు. అయితే ఈ సంఘటన గురించి తెలిసినా ఆస్పత్రి ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచారు.
ఘటన జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడానికి బాధితురాలు ఔట్ పోస్టు పోలీసులను ఆశ్రయించారు. అయితే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. తన విభాగానికి చెందిన సీనియర్ డాక్టర్ దృష్టికి తీసుకువెళితే ఆర్ఎంఓకు చెప్పాలని చెప్పి పట్టించుకోలేదు. తనపై జరిగిన ఈ దాడిపై ఎవరూ చర్యలు తీసుకోకపోవడంతో ఆమె టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పురోగతి ఇంకా తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook