)
Vande Bharat Express: విశాఖ జిల్లా మర్రిపాలెంలో సుమారు రూ.300 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. అందుకు మర్రిపాలెంలో ఈ నిర్వహణ డిపో ఏర్పాటుకు అవసరమైన భూమి అందుబాటులో ఉంది. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి నాలుగు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ల మధ్య రెండు రైళ్లు ఏకకాలంలో తిరుగుతున్నాయి. మూడో రైలు విశాఖపట్నం నుంచి దుర్గ్‌కు, నాలుగో రైలు విశాఖపట్నం నుంచి భువనేశ్వర్‌కు వెళ్తున్నాయి.
ఈ నాలుగు రైళ్లలో, సికింద్రాబాద్ నుంచి వందే భారత్ రైలు మధ్యాహ్నం బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుకునే రైలు నిర్వహణ పనులు ప్రస్తుతం విశాఖపట్నంలోని కోచ్ మెయింటెనెన్స్ డిపోలోనే జరుగుతున్నాయి. మిగిలిన మూడు రైళ్ల నిర్వహణ ఆయా ప్రాంతాల్లోనే చేస్తున్నారు.
వందేభారత్ రైళ్లకు కొత్త డిపో ఏర్పాటుతో విశాఖపట్నం నుంచి నడిచే అన్ని వందే భారత్ రైళ్ల నిర్వహణ ఇక్కడే సులభతరం అవుతుందంటున్నారు. ఇది రైళ్ల సమయపాలనను మెరుగుపరచడంతో పాటు, నిర్వహణ ఖర్చులను కూడా తగ్గించడంలో సహాయ పడుతుందని భావిస్తున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ వందే భారత్ రైళ్ల సేవలను విస్తరించే పనిలో ఉండటంతో.. విశాఖపట్నంలో డిపో ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. విశాఖపట్నం జోనల్ కేంద్రంగా మారడంతో, భవిష్యత్తులో మరిన్ని వందే భారత్ రైళ్లు ఇక్కడి నుంచి నడిచే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.