Vangaviti Daughter: పొలిటికల్ ఎంట్రీ కి రెడీ అవుతున్న వంగవీటి రంగా కుమార్తె..! ఆ పార్టీనే టార్గెట్..?

Vangaviti Daughter Political Entry: వంగవీటి కుంటుంబం నుండి మరొకరు రాజకీయాలలోకి వస్తున్నారనే చర్చ బెజవాడలో హాట్ టాఫిక్‌గా మారింది. వంగవీటి మోహన రంగా కుమార్తె ఆశ కిరణ్‌ రాజకీయ ఆరంగేట్రం చేస్తారని సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అవుతోంది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 16, 2025, 11:09 AM IST
Vangaviti Daughter: పొలిటికల్ ఎంట్రీ కి రెడీ అవుతున్న వంగవీటి రంగా కుమార్తె..! ఆ పార్టీనే టార్గెట్..?

Vangaviti Daughter: తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ప్రభంజనం వీస్తోన్న సమయంలో వంగవీటి రంగా ఆయనకు వ్యతిరేకంగా అప్పటి టీడీపీ మహానాడుకు పోటీ కాపు నాడు సభ నిర్వహించి ఎన్టీఆర్ కు సవాల్ విసిరారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రత్యర్ధులు ఆయన్ని దారుణంగా హత్య చేశారు. అప్పట్లో కొంత మంది ఈ హత్య ఎన్టీఆర్, చంద్రబాబు నేతృత్వంలోనే వాళ్లే చేయించరనే ప్రచారం కూడా జరిగింది. ఆయన మరణం తర్వాత విజయవాడ దాదాపు నెల రోజుల పాటు తగలబడింది. ఇక 1983, 1985 ఎన్నికల్లో విజయ్ ఢంకా మోగించిన ఎన్టీఆర్... రంగా మరణంతో 1989 జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. అంతలా ఆయన హత్య ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు అట్డుడుకాయనే చెప్పాలి. గిట్టని వాళ్లు ఆయన్ని బెజవాడ రౌడీగా పిలుస్తుంటారు. ఆయన వల్లే బెజవాడ రౌడీయిజం పెరిగిందనే టాక్ కూడా ఉంది.  

Add Zee News as a Preferred Source

తాజాగా ఈయన కూతురు ఆషా ఈరోజు  విజయవాడ బందరు రోడ్డులోని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తరువాత ఆమె తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను రంగా కుటుంబ సభ్యులు ఖండించకపోవడంతో..ఈ వార్తకు బలం చేకూరినట్లైంది.

మరో పక్క వంగవీటి రాధా కృష్ణ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపధ్యంలో వంగవీటి మోహన రంగా కుమార్తె రాజకీయ ప్రవేశ మంటూ జరుగుతున్న ప్రచారానికి ప్రాథాన్యత సంతరించుకుంది. ఇంతకీ ఆమె రాజకీయ ప్రవేశం చేస్తే ఏ పార్టీలోకి వెళతారు..? అనే అంశం ఇప్పడు బెజవాడలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద వంగవీటి కుంటుంబం నుండి మరొకరు రాజకీయాలలోకి వస్తున్నారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.అయితే వంగా మరణం తర్వాత ఆమె భార్య రత్నకుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత అధిష్ఠానంతో పొరపొచ్చాలు వచ్చి ఇండిపెంటెంట్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంది. వంగా, రత్నకుమారిల కుమారుడు రాధా ప్రస్తుతం రాజీకాయాల్లో కొనసాగుతున్నాడు. తండ్రి అంత దూకుడు స్వభావం లేదు. ప్రస్తుతం రాజకీయ ఉనికి కోసం పోరాడుతున్నాడు. ఈ నేపథ్యంలో రాధా సోదరి.. రాజకీయ రంగ ప్రవేశం చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. 

Also Read:​  మీ ఏజ్ ప్రకారం రోజు ఎంత లిక్కర్ తీసుకోవాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Also Read:​  చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News