Vijaya Shanthi: అన్న లెజినోవా గుండుపై భీభత్సంగా ట్రోల్స్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి !

Vijaya Shanthi on Anna Lezinovo Trolls: అన్న లెజినోవో ఇటీవల వర తిరుమలలో మొక్క నిమిత్తం గుండు చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె గుండు పై తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. అయితే విజయశాంతి ఈ ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

Written by - Renuka Godugu | Last Updated : Apr 16, 2025, 09:08 AM IST
Vijaya Shanthi: అన్న లెజినోవా గుండుపై భీభత్సంగా ట్రోల్స్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి !

Vijaya Shanthi on Anna Lezinovo Trolls: అన్నా లెజినోవో ఆమె ఇటీవల తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని గుండు గీయించుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు రూ.17 లక్షల విరాళం కూడా అన్నదానానికి ఆమె వితరణ చేశారు. ఈ నేపథ్యంలో అప్పటినుంచి అన్న లెజినోవా ఆమె కుమారుడుపై బీభత్సంగా ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై స్పందించిన విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం కానీ దేశం నుంచి వచ్చి పుట్టుకతోనే వేరే మతం అయినా కానీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అయిన అన్న లెజీనోవా గారిపై ఇలాంటి కామెంట్స్ చేయడం దురదృష్టకరం అసమంజసం అన్నారు. 

Add Zee News as a Preferred Source

అంతేకాదు తన కొడుకు అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డాడని విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం కోసం ఆమె కృతజ్ఞతగా తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి దర్శించుకుని , తలనీలాలు సమర్పించి, అన్నదానం ట్రస్టు కూడా విరాళం ఇచ్చి సేవ కూడా చేసింది. సంప్రదాయాన్ని గౌరవించిన అన్న లెజినోవ గారికి కూడా ట్రోల్స్ చేసేవారు తప్పు అని చెప్పక తప్పడం లేదు అని ట్విట్టర్‌ వేదికగ విజయశాంతి రాసుకువచ్చింది.

 ఈ నెలలో 8వ తేదీ సింగపూర్ స్కూల్‌లో జరిగిన స్కూలు ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్‌ శంకర్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. అతనికి కాళ్లకు చేతులకు గాయాలు అవడంతో పాటు ఊపిరితిత్తుల లో పొగ చేరింది. అయితే వెంటనే స్పందించిన స్కూల్ యాజమాన్యం అతన్ని ఆసుపత్రికి తరలించారు. తెలుసుకున్న వెంటనే చిరంజీవి సురేఖ దంపతులు కూడా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డిప్యూటీ సీఎం మన్నెం పర్యటనలో ఉన్నారు. పర్యాటన పూర్తి చేసుకున్న తర్వాత సింగపూర్ కి అన్న వదినతో పాటే బయలుదేరారు. అక్కడ మార్క్‌ శంకర్‌కు చికిత్స చేయించి హైదరాబాద్ కూడా తీసుకువచ్చారు .

 

 

హనుమాన్ జయంతి రోజే ఇండియాకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన నేతలు కార్యకర్తలు సంతోష పడ్డారు. ప్రమాదం తప్పి తిరిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మార్క్‌ శంకర్ కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అందరికీ ధన్యవాదాలు ఎక్స్ వేదికగా చెప్పిన సంగతి తెలిసిందే ఇదిలా ఉండగా ప్రమాదం తర్వాత అన్న మొక్కులు తీర్చుకోవడానికి మొన్న తిరుమల వెళ్లి గుండు గీయించుకొని తలనీలాలు సమర్పించారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి.

ఇదీ చదవండి: నేడు పిడుగులతో కూడిన వర్షాలు..  ఈ జిల్లాల్లో 40 కీమీ వేగంతో ఈదురు గాలులు ..  

ఇదీ చదవండి:   ఉదయం ఈ 5 అనారోగ్యకరమైన అల్పాహారాలకు దూరంగా ఉండాలని కార్డియాలజిస్టుల హెచ్చరిక..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News