)
Vizag for Sale: విశాఖపట్నంలో ఉర్సా అనే అనామక కంపెనీకు చంద్రబాబు ప్రభుత్వం విశాఖపట్నంలో 3 వేల కోట్ల విలువైన భూముల్ని ధారాదత్తం చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ ఘటనపై విజయవాడ మాజీ ఎంపీ కేశినేని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ భూ భాగోతం వెనుక తన తమ్ముడు , విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హస్తముందని ఆరోపించారు.
విశాఖపట్నంలోని కాపులుప్పాడులో 3 వేల కోట్ల విలువైన భూముల్ని అనామక కంపెనీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఏపీ ప్రభుత్వం అప్పగించింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంపై చెలరేగుతున్న విమర్శలకు ప్రభుత్వం సమాధాన చెప్పలేకపోతోంది. దాంతో అమెరికాలోని ఆ కంపెనీ ప్రమోటర్లతో జూమ్ కాల్ ఏర్పాటు చేయించి తమకు అనుకూలమైన జర్నలిస్టుల్ని పార్టీ నేతలతో మాట్లాడించింది. అయితే ఈ చర్య భూముల స్కాం అనుమానాల్ని మరింతగా పెంచింది. ఇదే అంశంపై విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం బాగోతం వెనుక తన తమ్ముడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హస్తముందని ఆరోపించారు. ఆ కంపెనీ ఇద్దరు ప్రమోటర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ తన తమ్ముడితో కలిసి చదువుకున్నాడని చెప్పారు. 21 సెంచరీ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ తెరిచి ప్రజల్నించి డబ్బులు సేకరించి మోసం చేసిన సంఘటన గతంలో ఉందని గుర్తు చేశారు.
అయితే టీడీపీ వర్గీయులు సోషల్ మీడియాలో కేశినేని నానిని టార్గెట్ చేశారు. నాని ఒక సైకో అని తిట్టడం మొదలెట్టారు. అయినా సరే కేశినేని నాని వెనక్కి తగ్గలేదు. ఎన్ని జూమ్ మీటింగులు పెట్టినా, ఎవరెన్ని బూతులు తిట్టినా తనకే సమస్య లేదని చెప్పుకొచ్చారు. వైజాగ్ ఈజ్ ఫర్ సేల్ అనేది మాత్రం ఖాయమని స్పష్టం చేస్తూ మరోసారి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. విశాఖపట్నం మహా నగరాన్ని అమ్మకానికి పెట్టేశారంటూ విమర్శలు గుప్పించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి