URSA Land Scam: ప్రస్తుతం ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఉర్సా కంపెనీకు ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో 60 ఎకరాల ఖరీదైన భూముల్ని కేవలం 56 రూపాయలకు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. ఈ భూముల వెనుక ఉన్నది ఎవరో తీగ లాగి వివరించారు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని.
విశాఖపట్నంలో అత్యంత విలువైన 60 ఎకరాల భూమిని కేవలం రెండు నెలల క్రితం ఏర్పాటైన ఏ మాత్రం ఎలాంటి అనుభవం లేని సూట్‌కేస్ కంపెనీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ కంపెనీకు ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం ఐటీ పార్క్ లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలను కేటాయించింది. ఈ కంపెనీ కేవలం ఇద్దరు డైరెక్టర్లతో రెండు నెలల క్రితమే ఏర్పాటైనట్టు ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టలేదు. ఇదొక సూట్‌కేస్ కంపెనీలా కన్పిస్తోంది. అలాంటి కంపెనీకు విలువైన భూములు అప్పగించడం వివాదం రేపుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా విజయవాడ మాజీ ఎంపీ , మాజీ వైసీపీ నేత కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నదీ తీగ లాగి డొంకంతా కదిపారు.
ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకు భూమి కేటాయించడాన్ని కేశినేని నాని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. సంస్థ ఏర్పాటైన వారాల వ్యవధిలోనే భూమి కేటాయించడం సహేతుకం కాదన్నారు. ఈ సంస్థకు ఎలాంటి అనుభవం లేకపోవడం, భారీ ప్రాజెక్టులు చేసే నేపధ్యం లేకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నాడని కేశినేని నాని స్పష్టం చేశారు. ఉర్సా సంస్థ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ కేశినేని నానికి అత్యంత సన్నిహితుడని, కళాశాలలో కలిసి చదువుకున్నారని తెలిపారు. 21 సెంచరీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో కేశినేని నాని, అబ్బూరి సతీష్ బాగస్వామ్యులుగా ఉండేవారని గుర్తు చేశారు. ఆ సంస్థ ప్రజల్నించి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిందనే ఆరోపణలు ఉన్నాయన్నారు.
ఉర్సా కంపెనీకు భూముల కేటాయింపు వెనుక కేశినేని చిన్ని ప్రమేయం ఉందని కేశినేని నాని ఆరోపిస్తున్నారు. ఎంపీగా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తన పలుకుబడిని ఉపయోగించి ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. అంతేకాకుండా ఇసుక, బూడిద మట్టి, గ్రావెల్ మైనింగ్, క్యాసినో, రియల్ ఎస్టేట్ మాఫియా రంగాల్లో చిన్న ప్రమేయం ఉందని విమర్శించారు. నారా లోకేశ్ పేరుని కేశినేని చిన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆందోళన ప్రజల్లో ఉందన్నారు. అందుకే ఉర్సా కంపెనీకు కేటాయించిన భూముల్ని వెంటనే రద్దు చేసి ఆ సంస్థ యాజమాన్యం, నిధుల మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేశినేని నాని డిమాండ్ చేశారు.
Also read: AP Mega DSC Notification 2025: మెగా డీఎస్సీ ఎలా అప్లై చేయాలి, వయసు, విద్యార్హత ఏంటి పూర్తి వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









