)
Cyclone impact Andhra Pradesh: విజయవాడ నగరంలో ప్రజల భద్రత కోసం పోలీసులు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. నగరంలో ఎక్కడా వాహనాలు రోడ్ల పైకి రాకుండా చూడాలని ఉన్నతాధికారులు సూచించారు. అందుకు అనుగుణంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రజలు కూడా రోడ్ల పైకి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఒక్కరు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఏరియాలో పోలీసులు నియంత్రణ చర్యలను.. చేపడుతున్నారు. ఈ ఆంక్షలు ప్రజల రక్షణ కోసం, వారు ఎలాంటి ప్రమాదంలో పడకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలు.
ఇక రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావం పెరుగుతోంది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే గాలులు.. వర్షాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిపై అమరావతిలో ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనిత, నారాయణ, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం తుఫాను తీరానికి దగ్గరగా వస్తోందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం తదితర తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని వివరించారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. గతంలో వచ్చిన తుఫానుల నష్టాన్ని గుర్తుచేసుకుంటూ, ముందుగా అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడ మరియు ఆ పరిసర ప్రాంతాలకు రెస్క్యూ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపాలని సూచించారు. గాలులు, వర్షాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ముందుగానే అంచనా వేసి అందుకు తగిన విధంగా ప్రజల రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది.
విశాఖ, ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే పూర్తిగా అప్రమత్తంగా ఉంచామని సీఎస్ తెలిపారు. ప్రజల ప్రాణాలు.. ఆస్తులకు ఎలాంటి ప్రమాదం కలగకుండా అన్ని శాఖలు కలిసి కీలక చర్యలు కొనసాగిస్తున్నాయని తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వం, పోలీసులు..రక్షణ సిబ్బంది అందరూ కలిసి తుఫాను పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు అధికారుల సూచనలు తప్పకుండా పాటిస్తే..ప్రమాదాలు తగ్గి అందరూ సురక్షితంగా ఉండగలరు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి