Pesaladinne Village: ప్రభుత్వం అనేది ప్రజల కోసమే ఉన్నది అనేది అందరికీ తెలిసిందే కదా. అది చాలా మటుకు నీటి మీద రాతలే మారుతున్నాయి. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో ఆ గ్రామస్థులు సొంతంగా తమ గ్రామానికి రోడ్డు వేసుకున్నారు. ఎంతో కాలంగా ప్రభుత్వం తమ ఊరికి రహదారి వేస్తుందని ఎదరు చూశారు ఆ గ్రామస్తులు. కానీ ప్రయోజనం మాత్రం కనిపించలేదు. తమ గ్రామంలో రోడ్డును పాలకులు బాగు చేయలేకపోవడాన్ని నిరసిస్తూ గ్రామ ప్రజలు అందరూ కలిసి తలా కొంత డబ్బులు వేసుకుని రోడ్డును బాగు చేసుకున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నె గ్రామం నుంచి పెద్ద మరివిడి, గోనెగండ్ల వెళ్లే రోడ్డు గత 30 ఏళ్ల నుంచి పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ దారి గుండా నిత్యం గ్రామ ప్రజలు తమ పొలాలకు వెళుతుంటారు. అలాగే పెసలదిన్నె నుంచి పెద్ద మరివీడి, గోనెగండ్ల కూడా ఈ రోడ్డు మీదనే ప్రయాణించాలి.
తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని ఉన్నతాధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా రోడ్డును బాగు చేయకపోవడంతో పెసలదిన్నె గ్రామస్థులు అందరూ కలిసి పాడైన రోడ్డును తమ సొంత నిధులు వెచ్చించి, మట్టిని తోలి జేసీబీ సహాయంతో మట్టి రోడ్డును నిర్మించుకున్నారు. కలిసి కట్టుగా ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుందని నిరూపించారు.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









